ఆరోగ్యంగా ఉండాలన్నా.. ఎక్కువ కాలం జీవించాలన్నా మంచి ఆహారం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

 ఏ ఒక్క సూపర్‌ఫుడ్ దీర్ఘాయువుకు హామీ ఇవ్వకున్నా.. కొన్ని శాఖాహార పదార్థాలు మాత్రం మెరుగైన ఆరోగ్యానికి దోహదం చేస్తాయి.

Image Credit : google

మొక్కల ఆధారిత ఆహారాలు గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహించి.. దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మరి ఎలాంటి ఆహారాలను తీసుకోవాలో కూడా పూర్తిగా తెలుసుకోండి.

Image Credit : google

గింజలు : నట్స్ వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను ఉంటాయి. ఇవి పోషకాలతో నిండి ఉంటాయి.  ముఖ్యమైన కొవ్వు ఆమ్లాలు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు లభిస్తాయి. బాదం, వాల్‌నట్‌, పిస్తా వంటి గింజలు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించి, దీర్ఘాయువును ఇస్తాయి.

Image Credit : google

విత్తనాలు : ఇవి చూడటానికి చిన్నవే అయినా ప్రయోజనాలు మాత్రం ఎక్కువ. అవిసె గింజలు, చియా గింజలు, పొద్దుతిరుగుడు విత్తనాలలో పోషకాలు ఎక్కువ.  ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు, ఫైబర్, మినరల్స్‌ను అందిస్తాయి. గుండె ఆరోగ్యాని పెంచుతాయి విత్తనాలు.

Image Credit : google

తృణధాన్యాలు : క్వినోవా, బ్రౌన్ రైస్, వోట్స్ వంటి తృణధాన్యాలు రక్తంలో చక్కెరను నియంత్రిస్తాయి. జీర్ణక్రియను మెరుగుపరిచి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. తృణధాన్యాలు ఊబకాయం, టైప్ 2 మధుమేహాన్ని కూడా తగ్గిస్తాయట.

Image Credit : google

ఆకుపచ్చ కూరగాయలు : బచ్చలికూర, కాలీఫ్లవర్, బ్రోకలీ వంటి ఆకుపచ్చ కూరగాయలు అధిక పోషక పదార్ధాలను కలిగి ఉంటాయి. విటమిన్ A, C, K, అలాగే ఫోలేట్, ఐరన్, కాల్షియంతో నిండి ఉంటాయి. ఈ కూరగాయలు ఎముకల ఆరోగ్యానికి తోడ్పడతాయి.

Image Credit : google

గ్రీన్ టీ : గ్రీన్ టీ ఆరోగ్య ప్రయోజనాలకు ప్రసిద్ధి. కాటెచిన్‌లు, కణాలను దెబ్బతినకుండా కాపాడే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్‌లు పుష్కలంగా ఉన్నాయి. గ్రీన్ టీ మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. కొవ్వు తగ్గడానికి సహాయపడుతుంది. క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. 

Image Credit : google