పెరుగులో మనకు ఎన్నో పోషకాలు ఉంటాయి.  కాల్షియం, విటమిన్ బి2, పొటాషియం, మెగ్నిషియం వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. 

Image Credit : google

ప్రొబయోటిక్ వల్ల మన జీర్ణక్రియ మెరుగుపడుతుంది. పెరుగు మన కడుపు, పేగుల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. 

Image Credit : google

రోజు పెరుగు తినడం వల్ల రోగ నిరోదక శక్తి పెరుగుతుంది. తుమ్ములు, జలుబు, జ్వరం వంటివి రాకుండా చేయడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది.

Image Credit : google

పెరుగు తినడం వల్ల క్యాన్సర్ ప్రమాదం నుంచి కూడా రక్షించుకోవచ్చు. మధుమేహానికి కూడా పెరుగు ఔషధంలా పనిచేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది.

Image Credit : google

పెరుగు తినడం వల్ల అధిక రక్తపోటు కూడా కంట్రోల్ లో ఉంటుంది. ఇందులో ఉండే పొటాషియం, మెగ్నిషియం అధికంగా ఉండటంతో బీపీ నియంత్రణలో ఉంటుంది.

Image Credit : google

కాల్షియం ఉండటం వల్ల ఎముకలు, దంతాలు బలంగా ఉంటాయి. ఉదయం పూట తీసుకోవడం వల్ల మన శరీరం ఎనర్జిటిక్ గా మారుతుంది.  

Image Credit : google

పెరుగుతో మొటిమలను నివారించుకోవచ్చు. రోజు తినడం వల్ల మనకు మేలు కలుగుతుంది.

Image Credit : google