రీసెంట్ గా టీవి నటి హీనా ఖాన్‌కు బ్రెస్ట్‌ క్యాన్సర్‌ ఉన్నట్లు నిర్ధారణ అయింది. కానీ ఈ క్యాన్సర్‌ మూడో దశలో ఉన్నప్పుడు గుర్తించారు డాక్టర్లు.

డబ్బు చదువు ఉన్నా కూడా క్యాన్సర్ ను మొదట్లో ఎందుకు గుర్తించలేదు. చివరి దశలోనే ఎందుకు గుర్తించారు? దీనికి గల కారణాలు తెలుసుకుందాం. 

అందరి జీవశైలి పూర్తిగా మారిపోతోంది. స్మోకింగ్, ఆల్కహాల్‌ ను ప్రతి ఒక్కరు సేవిస్తున్నారు. శారీరక శ్రమ కూడా పూర్తిగా తగ్గిపోతుంది. కొన్ని సార్లు తినడానికి కూడా సమయం ఉండటం లేదు.

ఏది పడితే అది తినడం వల్ల రోగ నిరోధక శక్తి మీద ప్రభావం పడుతుంది. దీంతో ఎన్నో వ్యాధుల బారున పడుతున్నారు

లైఫ్ స్టైల్ బిజీగా మారడం వల్ల చాలా వ్యాధులను గుర్తించలేకపోతున్నారు. కొన్ని లక్షణాలు ముందు నుంచే ఉన్నా వాటిని లైట్ తీసుకుంటున్నారు.

అయితే ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి కూడా కనీసం 6 నెలలకు ఒకసారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవాలి అంటున్నారు నిపుణులు. ఆరోగ్యంపై ఓ క్లారిటీతో ఉండాలి

ఏ చిన్న మార్పు కనిపించినా వైద్యులను సంప్రదించాలి. వీలైనంత త్వరగా సంబంధిత టెస్టులు చేయించుకోవాలి.

శరీరం ఎప్పటికప్పుడు లక్షణాలను చెబుతుంది. కానీ వాటి మీద దృష్టి పెట్టాలి. మీకు అవగాహన లేకపోతే స్నేహితులు, కుటుంబ సభ్యులతో చెప్పి టెస్టులకు వెళ్లాలి. అప్పుడు మీరు సమస్యల భారిన పడరు.