మొహం మీద ఉడే రంధ్రాలు చర్మాన్ని ఇబ్బంది పెడుతుంటాయి. వీటి వల్ల మొహం అందంగా కనిపించదు. మరి వీటిని ఎలా తొలగించాలి అని చాలా విధాలుగా ప్రయత్నాలు చేశారా? అయితే ఇప్పుడు కొన్ని ఫేస్ ప్యాక్ లను తెలుసుకుందాం.

2 టేబుల్ స్పూన్ల ముల్తానీ మిట్టి, 1 టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ లను తీసుకొని మెత్తగా కలపండి. దీన్ని ఫేస్ కు అప్లే చేసి 15-20 నిమిషాలు ఉంచి కడిగేయండి. దీని వల్ల అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది.

1 గుడ్డు తెల్లసొన ను తీసుకొని నురుగు వచ్చే వరకు కలిపి అందులో ఒక నిమ్మరసం వేసి బాగా కలపాలి. దీన్ని ముఖానికి అప్లే చేయండి. ఓ 15 నిమిషాలు ఆరిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి. తెల్లసొన చర్మాన్ని బిగుతుగా చేసి రంధ్రాలను తగ్గిస్తుంది. నిమ్మరసం చర్మాన్ని ప్రకాశవంతం చేస్తుంది.

పండిన టమాటో ను తీసుకొని గుజ్జులా కలపండి. గుజ్జును నేరుగా మీ ముఖానికి అప్లై చేయండి. దీన్ని 15-20 నిమిషాలు ఉంచి ఆ తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి. దీని వల్ల కూడా చాలా ప్రయోజనాలు ఉంటాయి.

2 టేబుల్ స్పూన్ల తేనె, 1 టీస్పూన్ నిమ్మరసాన్ని బాగా కలిపి మొహానికి పెట్టండి. 15-20 నిమిషాలు ఉంచి గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి. తేనె యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. చర్మాన్ని తేమగా మార్చడంలో సహాయపడుతుంది.

2 టేబుల్ స్పూన్ల ఓట్ మీల్, 2 టేబుల్ స్పూన్ల పెరుగును తీసుకొని బాగా కలపండి. దీన్ని ముఖానికి అప్లై చేసి 15-20 నిమిషాలు అలాగే ఉంచండి. గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి. ఓట్ మీల్ చర్మాన్ని సున్నితంగా ఎక్స్‌ఫోలియేట్ చేస్తుంది. మృతకణాలు, మలినాలను తొలగిస్తుంది, పెరుగులో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది, ఇది రంధ్రాలను బిగుతుగా చేస్తుంది.

2 టేబుల్ స్పూన్ల కలబంద జెల్, 1 టేబుల్ స్పూన్ దోసకాయ రసం కలిపి ముఖానికి అప్లే చేసుకోవాలి. దీన్ని 15-20 నిమిషాలు అలాగే ఉంచి.. చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఈ ఫేస్ ప్యాక్ లు మీ మొహానికి రిలాక్స్ ను ఇస్తూ ఓపెన్ పోర్స్ కు చాలా ఉపయోగాన్ని కలిగిస్తాయి. మరి ఇంకే ఓ సారి వైద్యుల సలహాతో ఉపయోగించండి.