ఒకప్పుడు ప్రేమ అనే పదం చాలా తక్కువ వినిపించేది. కానీ ప్రస్తుతం ఈ పదం ఎక్కువ వినిపిస్తుంది.  అయితే మిమ్మల్ని ఎవరు అయినా ప్రేమిస్తున్నారా? లేదా అని తెలిపే కొన్ని సంకేతాలున్నాయి.

కళ్లలోకి చూస్తుండటం..  మీరు మాట్లాడుతున్నప్పుడు ఒక వ్యక్తి ఏ వైపు కూడా చూడకుంటా మిమ్మల్ని మాత్రమే చూస్తూ మీ కళ్లల్లోకి మాత్రమే తదేకంగా చూస్తున్నారంటే మిమ్మల్ని ఆ వ్యక్తి ప్రేమిస్తున్నారని అర్థం.

తాకడానికి..  మిమ్మల్ని ముట్టుకోవడానికి, లేదా మాట్లాడుతూ ఏదో ఒక విధంగా మిమ్మల్ని టచ్ చేస్తే చాలు అన్నట్టుగా బిహేవ్ చేస్తుంటారు. మిమ్మల్ని ముట్టుకున్న తర్వాత చాలా కూల్ గా, లేదంటే హ్యాపీగా ఫీల్ అవుతారు. 

కేర్..  మీరు ఏదైనా చెబుతున్నప్పుడు చెప్పే విషయాన్ని శ్రద్దగా వింటూ మీ గురించి ఆలోచిస్తూ మీరు చేసిన మంచి పని గురించి ప్రశంసిస్తూ.. తప్పు చేస్తే కూల్ గా మీకు అర్థం అయ్యేలా చెబుతారు.

ఆకర్షించేందుకు ప్రయత్నం..  మీరు ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా ఏదో ఒక విధంగా మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నించడం. ఎలాగైనా మిమ్మల్ని లవ్ చేసేలా  చేస్తుంటారు. 

ఎప్పుడు అందుబాటులో..  చాలా అత్యవసర సమయాల్లో మినహాయించి ప్రతి సమయం మీకు అందుబాటులో ఉంటారు. మీకు అద్దంలా మీతోనే ఉంటారు. ఎలాంటి కష్టంలోనైనా తోడుంటారు

జెలసీ..  మీరు ఇతర వ్యక్తులతో మాట్లాడినా, ఇతరులకు ప్రాధాన్యత ఇచ్చినా వారు జెలసీ ఫీల్ అవుతారు.  సో ఈ క్వాలిటీస్ ఉంటే మిమ్మల్ని ఆ వ్యక్తి ప్రేమిస్తున్నట్టే.