కోస్టారికాకు చెందిన అడిస్ మిల్లర్ రీసెంట్ గా వాటర్ ఫాస్టింగ్‌తో 21 రోజుల్లో బరువు తగ్గడం వైరల్ గా మారింది. ఈయన 21 రోజుల పాటు ఆహారం, ఎలాంటి జ్యూస్ లు లేకుండా ఉన్నారు.

కేవలం నీరు మాత్రమే తాగి 21 రోజులు ఉన్నారు. దీని వల్ల బరువు తగ్గాలి అనుకున్నారు. అయితే వాటర్ మాత్రమే తాగుతూ ఎలాంటి ఇతర ఆహారాలను తీసుకోకపోవడాన్ని వాటర్ ఫాస్టింగ్ అంటారు.

21 రోజుల నీటి ఉపవాసం అడిస్ మిల్లర్ కు అద్భుతంగా పనిచేసినా.. సరైన వైద్య పర్యవేక్షణ లేకుండా ఇలా చేయడం ప్రమాదం అంటున్నారు నిపుణులు.

ఈ వాటర్ ఫాస్టింగ్ వల్ల ఎన్ని నష్టాలు ఉన్నాయో తెలుసుకుంటే మీరు ఎప్పటికీ ఇలాంటి రిస్క్ తీసుకోరు. ఓ సారి లుక్ వేయండి.

పోషకాహార లోపం : ఎక్కువ కాలం ఆహారం తీసుకోకుండా ఉండటం వల్ల విటమిన్లు, మినరల్స్, ఎలక్ట్రోలైట్స్ వంటి అవసరమైన పోషకాల లోపానికి దారితీస్తుంది. తద్వారా బలహీనత, మైకము, ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయి.

డీహైడ్రేషన్ : నీటిని మాత్రమే తీసుకుంటే హైడ్రేట్ గా ఉంటారు అనుకుంటారు కానీ ఇది తప్పు అంటున్నారు నిపుణులు. అధికంగా నీరు తీసుకోవడం వల్ల ఎలక్ట్రోలైట్ లోపం, అసమతుల్యత, నిర్జలీకరణానికి దారితీస్తుంది.

జీవక్రియ ప్రభావితం: ఎక్కువ కాలం ఉపవాసం చేయడం వల్ల జీవక్రియ, శక్తి స్థాయిలు తగ్గుతాయి. ఈ నీటి ఉపవాసం ముగిసిన తర్వాత అకస్మాత్తుగా బరువు పెరగవచ్చు అంటున్నారు నిపుణులు.

దూరం :  మధుమేహం, హృదయ సంబంధ వ్యాధులు లేదా ఈటింగ్ డిజార్డర్స్ వంటి వైద్యపరమైన పరిస్థితులు ఉన్నవారు తప్పనిసరిగా నీటి ఉపవాసానికి దూరంగా ఉండాలి.