పిల్లల జీవితం బాగలేదని తెలిస్తే తల్లిదండ్రి గుండె తట్టుకుంటుందా? వారి జీవితాలు బాగున్నా కూడా అమ్మాయి తల్లిదండ్రుల వల్లనే గొడవలు జరుగుతుంటాయి.

పంతాలకు పోయి, ఇగో వల్ల పిల్లల జీవితాలను నాశనం చేస్తుంటారు. వారి మాట నెగ్గాలనే పట్టుదల వల్ల అమ్మాయిని తెలియకుండానే ఇబ్బంది పెడుతుంటారు. 

ఇకనుంచి అయినా వీటిని మానుకోండి. కాస్త పిల్లల జీవితాలను వారికి వదిలేయండి. 

మీ ప్రమేయం లేని వారి జీవితం బాగుందంటే కాస్త మీ ఇగో, పంతం, కోపం, పట్టుదల వంటివి తగ్గించుకోండి.

ఉదయం రాత్రి ఫోన్ చేసి పదేపదే మాట్లాడుతుంటే తను కట్ చేయమని చెప్పలేదు. ఇంట్లో పని చేయలేదు. అందుకే సమయం చూసి ఫోన్ చేయాలి అంటారు నిపుణులు. 

బంగారం కొనలేదా? మీ ఆయన జీతం ఎంత? అత్త మామ ఎలా చూసుకుంటున్నారు? ఆడపడుచు పోరు ఉందా? మర్ది మాట వినడం లేదా?  వంటి ప్రశ్నలు అడగకూడదు. 

భర్తను కొంగున ముడేసుకో, ఇంట్లో పెత్తనం చెలాయించు అంటూ నెగిటివ్ ఆలోచనలను మీ కూతురు మనసులో రానివ్వకండి. 

వారి జీవితం బాగుండాలంటే  మీరే సమస్యలు తేవద్దు అంటున్నారు నిపుణులు. మరి అమ్మాయి తల్లిదండ్రులు కాస్త జాగ్రత్త.