స్పేస్ లో ఇరుక్కుపోయిన సునీత కు ఎలాంటి ఆరోగ్య సమస్యల రిస్క్ ఉంది ? 

స్పేస్ లో వాతావరణం మామూలు భూమి వాతావరణానికి చాలా భిన్నం. అందుకే వెళ్ళే వాళ్ళని సెలెక్ట్ చేయాలంటే ఎంతో వడపోత ఉంటుంది, తర్వాత శిక్షణా ఉంటుంది. 

కానీ, అనుకోని పరిస్థితుల్లో ఎక్కువ కాలం అక్కడే ఉండాల్సి వస్తే (ఇప్పుడు మన సునీతా విలియమ్స్ కి జరిగినట్లు) చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి.

ఒంట్లో ద్రవాలు పాదాల నుంచి మొహం వైపుకు వెళతాయి. మొహం ఉబ్బడం, బిగదీయడమే కాకుండా రక్తం తగ్గుతుంది, బీపీ మీద కంట్రోల్ ఉండదు

శరీరం క్రింద భాగం కండరాలు, క్షీణిస్తాయి. ఎముకలు గుళ్లగా అవుతాయి. 

మూత్ర వ్యవస్థ దెబ్బ తింటుంది... కిడ్నీ రాళ్ళు ఎక్కువ వస్తాయి

జీర్ణకోశం లో ఉండే బ్యాక్టీరియా దెబ్బ తింటాయి, పోషకాలు ఒంటికి పట్టడం తగ్గుతుంది. 

ఇంకా శరీరానికి balance తప్పడం, చూపు మందగించటం, కంటికి చేతులకు ఉండే సమన్వయం తప్పడం లాంటి రిస్కు కూడా ఉంటుంది. 

అంతరిక్షంలోకి వెళ్లే ముందు, అంతరిక్షంలో, వచ్చిన తర్వాత ఎన్నో వ్యాయామాలు చేయించినా ఎక్కువ కాలం ఉండాల్సి వస్తే మాత్రం రిస్కులు తప్పవు. అందుకే సునీత తొందరగా రావాలని మనసారా కోరుకుందాం0 !