వర్షాకాలంలో ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి

ఈ సమయంలో తిన్న ఆహారం త్వరగా జీర్ణమయ్యే అవకాశం లేదు. దీంతో ఆజీర్తి సమస్యలు వస్తాయి.  ఈ సమయంలో ఆయిల్ ఫుడ్ తీసుకోవడం వల్ల త్వరగా జీర్ణం కావు.

ఈ సమయంలో ఆకుకూరలు అస్సలు తినకూడదు. ఆకు కూరల్లో చిన్న చిన్న కీటకాలు దాగి ఉండే అవకాశం ఉంది. కొన్ని వేడి చేసినా తగ్గే అవకాశం లేదు.

మరీ ముఖ్యంగా మాంసానికి దూరంగా ఉండడం మంచిదని చెబుతున్నారు. జలరాశుల విషయంలోనూ చాల జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. 

వర్షాకాలం రాగానే చాలా మంది చేపలు తినడానికి ఇష్టపడుతారు. అయితే కొన్నింటిలో అత్యంత ప్రమాదకరమైన క్రిములు  ఆరోగ్యాన్ని దెబ్బతిస్తాయని అంటున్నారు. 

మరి ఈ సమయంలో ఏం తినాలి? అనే డౌట్ చాలా మందికి ఉంటుంది.  కాబట్టి కాస్త వేడి చేసే పదార్థాలను తీసుకోవచ్చు. అల్లంతో చేసే కాషాయాన్ని తీసుకోవాలి. 

పైన చెప్పిన వాటిని కాకుండా ఇతర కూరగాయలు తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉంటారు.  ఎక్కువ మొత్తంలో కాకుండా మితంగా తీసుకోవడం చాలా మంచిది.  బయటఫుడ్ వద్దు.