https://oktelugu.com/

హంటా వైరస్ అంటే ఏమిటి? దీని లక్షణాలు ఏంటి?

ఎలుకల మలం, మూత్రం, లాలాజలం ద్వారా మానవులకు సంక్రమిస్తుంది హంటా వైరస్.

Image Credit : google

Image Credit : google

రెండు ప్రధాన సిండ్రోమ్‌లకు కారణమవుతుంది ఈ వైరస్. అవి హంటా వైరస్ పల్మనరీ సిండ్రోమ్ (HPS), హెమోరేజిక్ ఫీవర్ విత్ రీనల్ సిండ్రోమ్ (HFRS)లు.

Image Credit : google

USలో ప్రబలంగా ఉన్న HPS తరచుగా జింక, ఎలుకల ద్వారా వ్యాపిస్తుంది. ఊపిరితిత్తులను ప్రభావితం చేస్తుంది.

Image Credit : google

HPS ప్రారంభ లక్షణాలు అలసట, జ్వరం, కండరాల నొప్పులు, కొన్నిసార్లు తలనొప్పి, మైకము కూడా రావచ్చు.

Image Credit : google

ప్రధానంగా యూరప్, ఆసియాలో కనిపించే HFRS, మూత్రపిండాలను ప్రభావితం చేస్తుంది. ఇది తీవ్రమైన లక్షణాలతో ఉంటుంది

Image Credit : google

ప్రారంభంలో HFRS లక్షణాలు తీవ్రమైన తలనొప్పి, వెన్నునొప్పి, జ్వరం, అస్పష్టమైన దృష్టి వంటివి వస్తాయి.

Image Credit : google

తరువాత HFRS లక్షణాలు తక్కువ రక్తపోటు, అంతర్గత రక్తస్రావం, మూత్రపిండాల వైఫల్యం వంటివి వస్తుంటాయి.

Image Credit : google

దీని నుంచి దూరంగా ఉండాలంటే ఎలుకలను ఇంట్లోకి రానివ్వకూడదు. ఎంట్రీ పాయింట్లను మూసివేయడం. ఆహార వనరులను శుభ్రపరచడం ద్వారా హంటా వైరస్ నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు.

Image Credit : google

అయితే ఈ వైరస్ కు నిర్దిష్ట చికిత్స లేదు. కోలుకోవడానికి సహాయక సంరక్షణ, లక్షణాల నిర్వహణ అవసరం అంటున్నారు నిపుణులు.