మందు తాగడం చాలా మందికి అలవాటు. ఇది ఆరోగ్యకరమైన వ్యక్తులను కూడా అనారోగ్య పాలు చేస్తుంది. మరి డయాబెటిస్ ఉంటే? ఇంతకీ డయాబెటిక్ పేషెంట్లు డ్రింక్ చేయవచ్చా? చేస్తే ఏం జరుగుతుంది అనే వివరాలు మీకోసం..

శరీరంలో ఎనర్జీ సోర్స్  అయినా చక్కెర తినే ఆహారాలు, తాగే డ్రింక్స్‌ ద్వారా సరఫరా అవుతుంది. కార్బోహైడ్రేట్లు, చక్కెర, కేలరీలు ఎక్కువగా ఉండే ఆహారాలు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది.

బీరు, వైన్ వంటి డ్రింక్స్‌లో ఎక్కువ కేలరీలు ఉంటాయి. వీటిని తాగితే షుగర్ లెవల్స్ పెరుగుతాయట.

బీరు, వైన్ వంటి డ్రింక్స్‌లో ఎక్కువ కేలరీలు ఉంటాయి. వీటిని తాగితే షుగర్ లెవల్స్ పెరుగుతాయట.

ఆల్కహాల్ ఎక్కువ తీసుకుంటే ఆకలి కూడా ఎక్కువ వేస్తుంటుది. దీంతో అతిగా తినాలి అనిపిస్తుంది. ఫలితంగా షుగర్ లెవల్స్‌ పెరగుతాయి. దీనివల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది.

ఆల్కహాల్ ఎక్కువగా తాగడం వల్ల ట్రైగ్లిజరైడ్ లెవల్స్‌, రక్తపోటు కూడా పెరుగుతాయట. ధీంతో వికారం, శరీరం ఎర్రబారడం, హృదయ స్పందన రేటు పెరగడం, మాటలు తడబడటం జరుగుతుంటాయి.

షుగర్‌ యాడెడ్‌ డ్రింక్స్‌లో కేలరీలు ఎక్కువ పోషకాలు తక్కువ ఉంటాయి.  రక్తంలో చక్కెర స్థాయిలను ఇవి త్వరగా పెంచుతాయి. అందుకే షుగర్ పేషెంట్లు కూల్ డ్రింక్స్, ఇతర షుగర్ డ్రింక్స్‌ తాగకూడదు.

డయాబెటిస్ బాధితులు ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సమయానికి తింటుండాలి. రెగ్యులర్‌ మీల్‌ టైమింగ్స్‌ పాటించడం వల్ల శరీరం ఇన్సులిన్‌ను సరిగా ఉపయోగించుకుంటుందట.