ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు పెద్దలు. ప్రస్తుతం ఆస్పత్రుల్లో పెట్టే ఖర్చు చూస్తే ఇది నిజమే అనిపిస్తుంది కదా.

Image Credit : google

అందుకే కాస్త ప్రజలు ఆరోగ్యం మీద దృష్టి పెట్టాలి. ఈ దృష్టిలో భాగంగా వ్యాయామం కూడా చేయాలి.

Image Credit : google

సరైన వ్యాయామం లేకపోవడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులు వస్తున్నాయి అంటున్నారు నిపుణులు.

Image Credit : google

కనీసం వారానికి 150 ని. లు అయినా వ్యాయామం చేయకపోతే ఒక వ్యక్తికి మాత్రమే కాదు దేశ ఆరోగ్య వ్యవస్థకు కూడా ముప్పే అంటున్నారు నిపుణులు.

Image Credit : google

అందుకే కనీసం వారానికి 150 ని.లు అయినా వ్యాయామం చేయమని సూచిస్తుంది ప్రపంచ ఆరోగ్య సంస్థ.

Image Credit : google

వ్యాయామం చేయకపోతే మధుమేహం, హైపర్ టెన్షన్, గుండె సంబంధిత సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు.

Image Credit : google

యువతలో 30 ఏళ్లు కూడా దాటకుండానే మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయట. కానీ నిరంతరం వ్యాయామం చేస్తే కండరాలు, ఎముకలు దృఢంగా మారతాయి.

Image Credit : google

యోగా, శారీరక శ్రమ కలిగించే క్రీడల వల్ల ఈ సమస్యలకు దూరంగా ఉండవచ్చని సూచిస్తున్నారు నిపుణులు.

Image Credit : google