ఉదయం పూట ఖాళీ కడుపుతో ఏ ఆహారాలు తీసుకోవాలి?

మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. మనం హాని చేసే వాటిని తీసుకుంటే మనకు చెడు చేస్తాయి. 

ప్రతి రోజు ఉదయం లేవగానే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే రోజంతా ఎంతో హాయిగా గడిచిపోతుంది. 

మనం హాని చేసే వాటిని తీసుకుంటే మనకు చెడు చేస్తాయి. అదే ప్రొటీన్లు ఉండే ఆహారాన్ని తీసుకుంటే మన శరీరం కూడా అందుకు సహకరిస్తుంది. 

రోజు ఉదయం లేవగానే ఓ గ్లాస్ మంచినీళ్లు వేడి చేసుకుని తాగితే కడుపులో ఉన్న మలినాలను బయటకు పంపిస్తుంది.

పరగడుపునే బొప్పాయి తింటే మంచిది. ఉదయం అల్పాహారంగా ఈ పండు తీసుకుంటే ప్రొటీన్లు బాగా అందుతాయి. ఇందులో ఎక్కువగా పీచు పదార్థం ఉటుంది. జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది.

పుచ్చకాయ ఉదయం ఆహారంలో తీసుకుంటే  శక్తి తోపాటు మినరల్స్, ప్రొటీన్లు కూడా అందుతాయి. ఉదయం ఆహారంలో దీన్ని తీసుకుంటే మన ఆరోగ్య వ్యవస్థ బాగుంటుంది. రోగాలు దరి చేరవు.

బాదంపప్పు కూడా మంచి డ్రైనట్స్. రోజంతా హుషారుగా ఉండేందుకు దోహదం చేస్తుంది. రాత్రిపూట నీళ్లలో నానబెట్టిన బాదంపప్పును ఉదయాన్నే పరగడుపున తీసుకుంటే ఎంతో ఆరోగ్యం చేకూరుస్తుంది.

ప్రతి రోజు ఉదయం కూరగాయల రసం తాగితే కూడా చాలా మంచిది. క్యారెట్, బీట్ రూట్, కీర దోస, టమాట, సొరకాయ, బీరకాయ తదితర కూరగాయలను అన్నింటిని కలిపి జ్యూస్ చేసుకుని తాగితే శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపే అవకాశం ఉంటుంది.