హిందూ సంప్రదాయంలో బొట్టుకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. రెండు బొమ్మల మధ్య, లేదా కాస్త పైకి బొట్టు పెట్టుకోవాలి అంటారు పెద్దలు.

బొట్టును పెట్టుకునే వేలు కూడా చాలా ప్రాధాన్యత సంతరించుకుంటుంది. బొట్టును ఏ వేలుతో పెట్టుకోవాలి అనుకుంటున్నారా?

బొట్టును బొటనవేలితో పెట్టుకుంటే పుష్టి కలుగుతుందని అంటున్నారు పండితులు.

చూపుడు వేలితో బొట్టు పెట్టుకుంటే ముక్తి కలుగుతుందట.

చేతి మధ్య వేలితో బొట్టు పెట్టుకోవడం వల్ల ఆయుష్షు పెరుగుతుందట.

ఉంగరం వేలు అంటే చిటికెన వేలు పక్కన వేలుతో పెట్టుకోవడం వల్ల అన్నానికి ఏ లోటు ఉండదట

ఇక చివరగా ఉండే చిటికెన వేలుతో మాత్రం అసలు బొట్టు పెట్టుకోకూడదు అంటున్నారు పండితులు.