https://oktelugu.com/

మిగిలిన చపాతీ పిండిని ఫ్రెష్ గా స్టోర్ చేయాలి అనుకుంటున్నారా? అయితే ఇదిగో టిప్స్..

Images source: google

చపాతీని రెడీ చేయడం అనుకున్నంత సులభం కాదు. అయితే ఈ చపాతీ పిండి కొన్ని సార్లు ఎక్కువ అవుతుంది.

Images source: google

మరి మిగిలిన ఈ పిండిని సరిగ్గా నిల్వ చేయాలంటే కొన్ని టిప్స్ పాటిస్తే సరిపోతుంది.

Images source: google

నూనె : పిండిని పిసికి కలుపుతున్నప్పుడు కొంచెం నూనె లేదా నెయ్యి వేయాలి. ఇది పిండిని ఎక్కువసేపు మృదువుగా ఉంచుతుంది. తర్వాత నిల్వ చేయండి.

Images source: google

 అల్యూమినియం ఫాయిల్‌లో: తేమను లాక్ చేయడానికి, పిండిని అల్యూమినియం ఫాయిల్‌లో చుట్టండి. పిండిని అన్ని వైపులా బాగా కప్పేయాలి. దీన్ని ఒక కంటైనర్లో ఉంచండి.

Images source: google

 గాలి చొరబడని కంటైనర్: పిండిని తాజాగా ఉంచడానికి గాలి చొరబడని కంటైనర్ ను ఉపయోగించడం మంచి మార్గం. పిండిని నిల్వ చేయడానికి ముందు శుభ్రమైన క్లాత్ తో ఆ కంటైనర్ ను తుడవండి.

Images source: google

 జిప్లాక్ సంచులు: పిండిని జిప్‌లాక్ బ్యాగ్‌లో భద్రపరుచుకోండి. సీలింగ్ చేయడానికి ముందు అందులోని గాలిని తీసేయండి. పిండిని ఎక్కువ కాలం తాజాగా ఉంచాలంటే ఈ పద్ధతి సరైనది.

Images source: google

 చల్లని, పొడి ప్రదేశంలో ఉంచండి: పిండిని ఒక కవర్ లో చుట్టి దానిని ఒక కంటైనర్‌లో ఉంచాలి. తర్వాత చల్లని, పొడి ప్రదేశంలో నిల్వ చేయాలి. పిండిని రిఫ్రిజిరేటర్‌లో ఉంచినా సరిపోతుంది.

Images source: google