మనలో చాలా మంది తిన్న తర్వాత వెంటనే బెడ్ ఎక్కుతారు. కానీ ఇలా చేయడం అసలు మంచిది కాదు. 

Image Credit : google

ఏ సమయంలో అయినా సరే తిన్న తర్వాత కాసేపు నడవాలి. ఓ రెండు అడుగులు నడిస్తే తప్పు లేదు కదా. మరి తిన్న తర్వాత నడవడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా?

Image Credit : google

తిన్న తర్వాత నడిస్తే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. గుండెల్లో మంట, మలబద్ధకం, ఉబ్బరం, కడుపు నొప్పి వంటి సమస్యలు తగ్గుతాయి అంటున్నారు నిపుణులు.

Image Credit : google

ముధుమేహంతో బాధపడుతున్నవారు భోజనం చేసిన తర్వాత నడిస్తే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. 

Image Credit : google

తిన్న తర్వాత నడవడం వల్ల కేలరీలు బర్న్ అవుతాయి. దీంతో బరువు కూడా తగ్గవచ్చు. 

Image Credit : google

మానసిక ఆరోగ్యం, గుండె ఆరోగ్యం బాగుంటుంది. కండరాలు, ఎముకలు బలోపేతం అవుతాయి. రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. 

Image Credit : google

డిన్నర్ తర్వాత నడవడం వల్ల నిద్రలేమి సమస్య దూరం అవుతుంది. అయితే ఈ నడక వేగంగా ఉండకూడదు. నిదానమే ప్రదానం. 

Image Credit : google

మరీ గంటలు గంటలు కూడా నడవాల్సిన అవసరం లేదు. తిన్న తర్వాత 30 ని. లు నడిస్తే చాలు అంటున్నారు నిపుణులు.

Image Credit : google