ఆరోగ్యంగా ఉండటానికి, వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే రోగనిరోధక శక్తిని మెండుగా ఉండాలి.

రోగనిరోధక శక్తి బలంగా ఉండాలంటే కొన్ని రకాల ఆహార పదార్థాలను క్రమం తప్పకుండా తీసుకోవాలి.

విటమిన్ సి లోపిస్తే వ్యాధులు, ఇన్ఫెక్షన్లు వస్తాయి. ఇవి ఎక్కువగా నారింజ, బత్తాయి, స్ట్రాబెర్రీ, పాలకూర, గోబీ, పపాయా, మామిడి పండ్లలో విటమిన్ సి ఉంటుంది.

విటమిన్ బీ 6: సాల్మాన్, టూనా వంటి చేపలు, చికెన్, శనగలు, పొద్దుతిరుగుడు గింజలు, పిస్తా, పాలకూరల్లో ఎక్కువ లభిస్తుంది.

విటమిన్ ఇ: ఇన్ఫెక్షన్లతో పోరాడటంలో శరీరానికి సహాయం చేస్తుంది విటమిన్ ఇ. బాదం, జీడిపప్పు, వేరుశనగ, విత్తనాలు, పాల కూర వంటి వాటిలో పుష్కలంగా ఉంటుంది.

కొందరు ఒకు సారి నాలుగు పండ్లను తిని వారం వరకు మళ్లీ తినరు. కానీ ఇవి నిలవ ఉండే విటమిన్లు కాదు. కాబట్టి రోజు తినాల్సిందే.

కొందరు విటమిన్ క్యాప్సిల్స్ ను తీసుకుంటారు. కానీ వాటికంటే ఇలా పండ్లు, కూరగాయల ద్వారా తీసుకోవడమే చాలా మంచిది.

ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి మీ రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి పైన తెలిపిన ఆహారాలను మీ డైట్ లో చేర్చుకోండి.