సిమ్లా ఆపిల్ లా ఉండే హనీ రోజ్ చూడగానే  ముద్దొచ్చేస్తోంది. తెలుగు జనాలకు ఈమె పెద్దగా పరిచయం లేదు. సోషల్ మీడియా  ఫాలో అయ్యే వాళ్లకు సుపరిచితురాలే.

ఈ గ్లామర్ క్వీన్ హాట్ ఫోటో షూట్స్ కి పెట్టింది పేరు.  నటిగా కంటే మోడల్ గా బాగా ఫేమస్.  కేరళకు చెందిన హనీ రోజ్ ని ఇంస్టాగ్రామ్  లో 1.8 మిలియన్ ఫాలో అవుతున్నారు.

2005లో విడుదలైన బాయ్ ఫ్రెండ్ మూవీతో సిల్వర్ స్క్రీన్  కి పరిచయం అయ్యారు. అది మలయాళ చిత్రం. నెక్స్ట్ తమిళ చిత్రం ముదల్  కన్నవే చేశారు.

హనీ రోజ్ నటించిన మొదటి తెలుగు చిత్రం ఆలయం. 2008లో విడుదలైన ఆలయం చిత్రానికి ముత్యాల సుబ్బయ్య దర్శకుడు. శివాజీ హీరో.

ఆలయం మూవీ పరాజయం కావడంతో హనీ రోజ్ కి తెలుగులో ఆఫర్స్  రాలేదు. ఎక్కువగా మలయాళ చిత్రాల్లో నటించిన హనీ అప్పుడప్పుడు తమిళ  చిత్రాల్లో నటించారు.

చాలా గ్యాప్ తర్వాత 2014లో మరోసారి తెలుగు  ప్రేక్షకులను పలకరించారు. వరుణ్ సందేశ్ కి జంటగా ఈ వర్షం సాక్షిగా చిత్రం  చేశారు. ఈ చిత్రం కూడా ఆడలేదు.

అనూహ్యంగా వీరసింహారెడ్డి మూవీలో బాలకృష్ణతో జతకట్టే  ఛాన్స్ ఆమెకు దక్కింది. వీరసింహారెడ్డి మూవీలో హనీ రోజ్ బాలకృష్ణ భార్యగా,  తల్లిగా రెండు భిన్నమైన షేడ్స్ ఉన్న పాత్ర చేశారు.

అనూహ్యంగా వీరసింహారెడ్డి మూవీలో బాలకృష్ణతో జతకట్టే  ఛాన్స్ ఆమెకు దక్కింది. వీరసింహారెడ్డి మూవీలో హనీ రోజ్ బాలకృష్ణ భార్యగా,  తల్లిగా రెండు భిన్నమైన షేడ్స్ ఉన్న పాత్ర చేశారు.