వరుణ్ తేజ్-లావణ్య పెళ్లి బంధంలో అడుగుపెట్టారు. ఇటలీ వేదికగా నవంబర్ 1న వరుణ్-లావణ్యల వివాహం ఘనంగా జరిగింది.

వీరిది ప్రేమ వివాహం అన్న విషయం తెలిసిందే.

2017లో వచ్చిన మిస్టర్ సినిమా షూటింగ్లో వీరిద్దరి మనసులు కలిశాయి. ఈ ప్రేమకథ ఐదేళ్లకు పైగా రహస్యంగా సాగింది.

తాజాగా ఈ కొత్త జంట ఫొటోలను నెట్టింట పోస్ట్ చేయడంతో అవి వైరల్ అవుతున్నాయి.

మెగా ఫ్యామిలీ మొత్తం వేడుకలో పాలుపంచుకుంది.

పవన్, నాగబాబు, చిరంజీవి, వీరి చెల్లెల్లు, బావలు, మెగా హీరోలంతా సందడి చేశారు