ఐఐటీ.. ఇంటర్ లో మ్యాథ్స్ కోర్స్ చదివే ప్రతీ విద్యార్థి కల. అదే స్థాయిలో ఉద్యోగాలు కల్పించే.. విద్యాసంస్థలు మనదేశంలో చాలా ఉన్నాయి.

సైన్స్ విభాగంలోనూ అత్యున్నత స్థాయిలో కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. ఇంతకీ ఆ విద్యా సంస్థలు ఏంటంటే..

IISC బెంగళూరు ఈ విద్యా సంస్థను స్థూలంగా Indian institute of science అని పిలుస్తారు. ఇది బెంగళూరులో ఉంది. కెమికల్, బయోటెక్నాలజీ, బయో కెమిస్ట్రీ, జువాలజీ విభాగాల్లో ఈ సంస్థ అత్యున్నత కోర్సులను అందిస్తోంది.

UGEE Undergraduate entrance exam.. హైదరాబాద్ త్రిబుల్ ఐటీ లో ప్రవేశానికి ఈ పరీక్ష నిర్వహిస్తారు.  హైదరాబాద్ పరిధిలో అత్యున్నత స్థాయిలో ఈ విద్యా సంస్థ ఇంజనీరింగ్ కోర్సులను ఆఫర్ చేస్తోంది.

COMEDK U GET Consortium of medical, engineering and dental colleges of Karnataka.. కర్ణాటక ప్రభుత్వం మెడికల్, ఇంజనీరింగ్, డెంటల్ కాలేజీలో సీట్ల భర్తీ కోసం నిర్వహించే ప్రవేశ పరీక్ష ఇది.

WB JEE West Bengal joint entrance examination పేరుతో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఈ పరీక్ష నిర్వహిస్తుంది..  పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో అత్యున్నత విద్యాసంస్థల్లో ఇంజనీరింగ్ ప్రవేశాల కోసం అక్కడి ప్రభుత్వం ఈ పరీక్ష నిర్వహిస్తుంది.

MHT CET Maharashtra cet పేరుతో మహారాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తోంది.. ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సులలో ప్రవేశం కోసం ఈ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తుంది.

Off-white Banner

Thanks For Reading...