57% మంది ఉద్యోగులు తమ పని-జీవిత సమతుల్యతను ప్రభావితం చేసే ఉద్యోగాన్ని చేయడానికి ఇష్టపడటం లేదు. ఏఏ దేశాల్లో  మంచి ఉద్యోగం, జీతం.. జీవితం ఉందో తెలుసుకుందాం.

న్యూజిలాండ్:   గ్లోబల్ లైఫ్-వర్క్ బ్యాలెన్స్ ఇండెక్స్ 2024 ప్రకారం, న్యూజిలాండ్ అత్యుత్తమ ఉద్యోగాలను అంటే పనిని కల్పిస్తుందట.

బలమైన ఆర్థిక వ్యవస్థ, 32 రోజుల వార్షిక సెలవుల భత్యం, 80% అనారోగ్య వేతన రేటు, సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను కలిగి ఉంది.

స్పెయిన్ యూరోపియన్ దేశంమైన స్పెయిన్ ఎక్కువగా చట్టబద్ధమైన వార్షిక సెలవులను అంటే 36 రోజులను అందిస్తుందట. వారానికి చాలా తక్కువ పని గంటలను చేయిస్తారట కూడా. 

వారంలో 40 గంటలు... ఐదు రోజులు పని చేయాలి.  ఇంతకు మించి పని చేస్తే కచ్చితంగా ఓవర్ టైమ్ కింద అధిక డబ్బు ఇస్తారు.

ఫ్రాన్స్  ఐరోపాలోని అతిపెద్ద దేశాలలో  ఫ్రాన్స్ ఒకటి.  వారానికి తక్కువ పని గంటలు (అంటే సగటున వారానికి 25.6 గంటలు) చేస్తారు. ఇక సంవత్సరానికి 36 రోజుల వార్షిక సెలవులు కేటాయిస్తారు. 

ఆస్ట్రేలియా:   ఏ ఇతర దేశంతో పోల్చినా ఆస్ట్రేలియాలో గంటకు అత్యధిక కనీస వేతనం చెల్లిస్తారట.  మంచి ఆరోగ్య సంరక్షణను, సేవలను అందిస్తారు.

అనారోగ్యంతో సెలవు పెట్టుకుంటే వంద శాతం జీతం చెల్లించాల్సిందేనట.  అత్యుత్తమ పని-జీవిత సమతుల్యత కలిగిన అగ్ర దేశాలలో ఆస్ట్రేలియా కూడా ఒకటి.