కాస్త కట్ అయినా సరే రక్తం ఎర్రగా వస్తుంది. అవును బ్లడ్ ఎర్రగా రాకపోతే ఎలా వస్తుంది అనుకుంటున్నారా? కానీ కొన్ని జంతువులకు మాత్రం ఎర్ర రక్తం ఉండదు. ఇంతకీ అవేంటో ఓ సారి చూసేయండి.
Image Credit : google
బ్రాకియోపాడ్స్ : ఇవి ఒక షెల్ లాంటి జంతువులు, రక్తాన్ని రవాణా చేయడానికి హెమెరిథ్రిన్‌ను ఉపయోగిస్తాయి. అవి లేత పసుపు రంగులో ఉంటాయి.
Image Credit : google
పీత : పీతల రక్తం నీలి రంగులో ఉంటుంది. ఎందుకంటే ఇందులో హిమోసైనిన్ ఉంటుంది, ఇది హిమోగ్లోబిన్‌కు బదులుగా ఆక్సిజన్‌ను తీసుకువెళ్లే ఒక రాగి ఆధారిత ప్రోటీన్.
Image Credit : google
ఆక్టోపస్ : వీటి రక్తంలో హిమోసైనిన్ అనే రాగి ప్రొటీన్ ఉంటుంది. ఇది ఆక్టోపస్ ల రక్తాన్ని ఎరుపు రంగుకు బదులుగా నీలం రంగులోకి మార్చుతుంది.
Image Credit : google
అంటార్కిటిక్ ఐస్ ఫిష్ : ఈ ఐస్ ఫిష్ కు కూడా ఎర్ర రక్త కణాలు ఉండవు. వీటికి తెల్లరక్త కణాలు ఉంటాయి. ఇదొక చేపల జాతి.
Image Credit : google
స్క్విడ్ : వీటి రక్తం నీలం రంగులో ఉంటుంది. ఎరుపు రంగులో ఉండదు. ఎందుకంటే ఇందులో హిమోసైనిన్ అనే రాగి ప్రోటీన్ అధికంగా ఉంటుంది.
Image Credit : google
సాలెపురుగులు : ఆక్సిజన్‌ను తీసుకువెళ్లడానికి హిమోసైనిన్‌పై ఆధారపడతాయి సాలెపురుగులు. వీటి రక్తం కూడా నీలి రంగులో ఉంటుంది.
Image Credit : google
ఎండ్రకాయలు : వీటి రక్తంలో హిమోసైనిన్ ఉంటుంది. వీటి రక్తం ఎరుపు రంగుకు బదులుగా నీలంగా ఉంటుంది.
Image Credit : google