అడవికి రారాజు.. మృగరాజు..  దాని జోలికి ఏ జంతువూ వెళ్లదు..  అయితే అలాంటి సింహానికి కూడా సింహ స్వప్నం కలిగించే జంతువులు కొన్ని ఉన్నాయి.

హైనాలు కపటత్వానికి మారుపేరుగా ఉండే ఈ హైనాలు ఒక్కోసారి సింహాలను కూడా వేటాడుతాయి సింహం పిల్లలపై ఇవి సామూహికంగా దాడి చేసి చంపి తినేస్తాయి.

మొసళ్ళు నీటిని తాగేందుకు సింహం అక్కడికి వస్తే   నీటిలోకి లాగేసి చంపేస్తాయి. ఇలాంటి సంఘటనలు ఎక్కువగా అమెజాన్ రైన్ ఫారెస్ట్ లో చోటుచేసుకుంటాయి.

చిరుత పులులు సింహాల కంటే చిరుతపులులు వేగంగా పరిగెడతాయి. భారీ సింహాలను ఇవి ఏమీ చేయకపోయినప్పటికీ.. సింహాల పిల్లలను మాత్రం చిరుతపులులు చంపి తినేస్తాయి.

కెఫ్ బఫెలో ఈ అడవి రకం దున్నలు ఎక్కువగా ఆఫ్రికా ఖండంలో కనిపిస్తాయి. ఇవి ఒక్కొక్కటి సింహం కంటే రెండింతల పరిమాణంలో కనిపిస్తాయి. వాటి జోలికి సింహం వస్తే తొక్కి చంపేస్తాయి.

ఏనుగులు సాధారణంగా ఏనుగుల జోలికి సింహాలు రావు.  గున్న ఏనుగులను చంపేందుకు సింహాలు ప్రయత్నిస్తే తమ తొండంతో కొట్టి చంపేస్తాయి.

ఖడ్గమృగాలు ఖడ్గమృగాలు పూర్తి శాకాహారులైన ఈ జంతువులు..  కొన్ని సార్లు సింహాలు ఖడ్గమృగాలను  చంపేందుకు  ప్రయత్నిస్తే సింహాలపై ప్రతి దాడి చేస్తాయి.

ఆఫ్రికన్ వైల్డ్ డాగ్స్ ఇది చూసేందుకు ఒక రకమైన తోడేళ్ల లాగా కనిపిస్తాయి.  ఇవి సమూహంగా ఉన్నప్పుడు సింహం పై దాడి చేసి సింహాన్ని చంపి తినేస్తాయి

పాములు సరిసృ ల్పాల జాతికి చెందిన పాములు కూడా సింహాలను చంపేస్తాయి..  అనకొండలు మాత్రమే కాకుండా, ఆఫ్రికన్ కోబ్రా, రాచనాగు వంటివి కూడా సింహాలను చంపేస్తాయి.