ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యకరమైన అలవాట్లు మిమ్మల్ని ఆనందంగా, సంతోషంగా ఉంచడంలో సహాయం చేస్తాయి. మరి ఆరోగ్యం కోసం ఎలాంటి అలవాట్లు ఉండాలో చూసేద్దామా?

తినడం : మీరు తినే ఆహారం మీద పూర్తి శ్రద్ధ తో తినాలి.దీని వల్ల ఆరోగ్యంగా ఉంటారు. అతిగా తినరు. అంటే మెరుగైన జీర్ణక్రియ కూడా మీ సొంతం.

డిజిటల్ డిటాక్స్ : తినేటప్పుడు, పడుకునే ముందు ఇలా ఎప్పుడైనా మొబైల్ పట్టుకుంటున్నారా? అయితే  దీన్ని పక్కన పెట్టి పుస్తకాన్ని చదవడం, నడవడం అలవాటు చేసుకోండి.

నిలబడటం : అస్తమానం కూర్చోకూడదు. అప్పుడప్పడు ఆఫీస్ లో లేదా ఇంట్లో అయినా సరే కాసేపు అటూ ఇటూ నడవాలి. దీనివల్ల రక్త ప్రసరణ బాగుంటుంది.

నిద్ర : ఆదివారం, శనివారం అంటూ మీ నిద్ర సమయాన్ని మార్చవద్దు. ఎప్పుడు కూడా ఒకే సమయానికి నిద్ర లేవాలి. దీని వల్ల ఆరోగ్యం బాగుంటుంది.

సాధారణ నీరు : వాటర్ తాగడం బోరింగ్‌గా అనిపిస్తే, అందులో నిమ్మకాయ, దోసకాయ లేదా పుదీనా వంటి వాటిని యాడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. ఇలాంటి ఇన్ఫ్యూజ్డ్ వాటర్ ఆనందదాయకంగా మార్చడమే కాకుండా మెరుగైన జీర్ణక్రియ అందిస్తాయి.

లివింగ్ స్పేస్ : ఇల్లు చక్కబెట్టుకోవడం, మీ చుట్టుపక్కల నీట్ గా పీస్ ఫుల్ గా ఉంచుకోవాలి. దీనివల్ల విశ్రాంతిగా హాయిగా అనిపిస్తుంది. దీనివల్ల మనసు సంతోషంగా ఉంటుంది.

నడవడం : రెగ్యులర్ గా నేచర్ వాకింగ్ అవసరం. దీనివల్ల దైనందిన జీవితం అందంగా మారుతుంది. ఆరోగ్యంగా ఉంటారు.