జింబాబ్వే తో టి20 వరల్డ్ కప్ నేపథ్యంలో సీనియర్ ఆటగాళ్లు అందరికీ బీసీసీఐ విశ్రాంతి ఇస్తోంది. 

గత కొంతకాలంగా తీరికలేని క్రికెట్ ఆడుతున్న సీనియర్ ఆటగాళ్లకు రెస్ట్ ఇచ్చి.. యువ ఆటగాళ్లకు జింబాబ్వే టూర్లో బీసీసీఐ అవకాశం కల్పించింది.. 

యువ జట్టుకు శుభ్ మన్ గిల్ నాయకత్వం వహిస్తాడు. 

జూలై 6 నుంచి టీమిండియా జింబాబ్వేతో ఐదు మ్యాచ్ ల టి20 సిరీస్ ఆడుతుంది.. హరారే స్పోర్ట్స్ క్లబ్లో ఈ మ్యాచ్లు జరుగుతాయి.

జింబాబ్వే టూర్ కు ఎంపికైన తెలుగుతేజం నితీష్ రెడ్డి ఇటీవల ప్రాక్టీస్ చేస్తుండగా గాయపడ్డాడు. దీంతో ఇతడి స్థానంలో శివమ్ దూబేను ఎంపిక చేశారు.

నితీష్ రెడ్డి స్వస్థలం విశాఖపట్నం. అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్లో అతడు రాణించగలడు.. ఐపీఎల్ లో హైదరాబాద్ జట్టులో ఆడిన అతడు.. అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు..

జింబాబ్వే టూర్ లో పాల్గొనే భారత జట్టు ఇదే 

గిల్(కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, రింకూ సింగ్, సంజు సాంసన్, ధృవ్ జూరెల్, రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, ఆవేష్ ఖాన్, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్, తుషార్ దేశ్ పాండే, శివం దూబే.