యాంటీ ఏజింగ్ కొరియన్ రైస్ జెల్ గురించి మీకు తెలుసా? ఇది చర్మాన్ని హైడ్రేట్ గా చేసి అందాన్ని ప్రసాదిస్తుంది. మరి దీన్ని ఎలా తయారు చేసుకోవాలో కూడా తెలుసుకోండి.

1 కప్పు బియ్యం, 2 కప్పుల నీరు, 1 టేబుల్ స్పూన్ అలోవెరా జెల్, 1 టీస్పూన్ గ్లిజరిన్, 1 టేబుల్ స్పూన్ తేనె, 1 టీస్పూన్ విటమిన్ ఇ ఆయిల్, 1 టీస్పూన్ రోజ్ వాటర్, 2-3 చుక్కల ఎసెన్షియల్ ఆయిల్

బియ్యం : కప్పు బియ్యాన్ని శుభ్రంగా కడగాలి. ఇందులో ఏమైనా మలినాలు ఉంటాయి కాబట్టి కడిగి 30 నిమిషాలు నానబెట్టాలి. నానబెట్టడం వల్ల బియ్యంలో పోషకాలు కూడా పెరుగుతాయి. నానబెట్టిన బియ్యాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని పొయ్యి మీద ఉడికించండి. బియ్యం ఉడికిన తర్వాత 15 నిమిషాలు అలాగే ఉంచండి.

ఉడికిన బియ్యాన్ని ఒక మిక్సీలో వేసి బ్లెండ్ చేయండి. వచ్చిన మిశ్రమం నుంచి వాటర్ ను మిగిలిన బియ్యం రేణువులను వేరు చేయండి.

కలబంద, గ్లిజరిన్:  వడకట్టిన రైస్ జెల్‌లో 1 టేబుల్ స్పూన్ అలోవెరా జెల్, 1 టీస్పూన్ గ్లిజరిన్ కలపండి. కలబంద హైడ్రేట్ గా ఉంచితే.. గ్లిజరిన్ తేమను లాక్ చేస్తుంది.

తేనె, విటమిన్ ఇ : మిశ్రమానికి 1 టేబుల్ స్పూన్ తేనె, 1 టీస్పూన్ విటమిన్ ఇ నూనె కలపండి. దీని వల్ల యవ్వనంగా ఉండవచ్చు. విటమిన్ ఇ ఆయిల్ చర్మాన్ని నయం చేసి, యాంటీ ఏజింగ్ ప్రయోజనాలను అందిస్తుంది.

చివరగా : స్మెల్ కోసం టీస్పూన్ రోజ్ వాటర్ 2-3 చుక్కల మీకు ఇష్టమైన నూనె కలపండి. రోజ్ వాటర్ చర్మ pH ని సమతుల్యం చేస్తుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది.

ఉపయోగం : ఈ యాంటీ ఏజింగ్ కొరియన్ రైస్ జెల్‌ను శుభ్రమైన, గాలి చొరని కంటైనర్‌లో నిల్వ చేసి ఫ్రిజ్‌లో ఉంచి ఉపయోగించవచ్చు. మెడ, మొహానికి ప్రతి రోజు వాడటం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి.