ఇంట్లో గుర్రం బొమ్మను పెడుతుంటారు చాలా మంది. కానీ ఇలాంటి బొమ్మలు అశుభం.

గొట్టం, విసనకర్ర వంటివి కాకుండా కొందరు నోటితో అగ్గిని ఊదుతారు. ఇలా చేయకూడదు.

ఇతరుల చెప్పులు, వస్త్రాలు ధరిస్తారు. ఇలాంటివి చేస్తే కూడా ఇంట్లో దరిద్రం తాండవిస్తుందట.

ఆకలి వేస్తుందని స్నానం చేయకుండానే కొందరు అన్నం తింటారు. ఇలా అసలు చేయకూడదు.

ఒకేసారి రెండు చేతులతో  నీటిని, నిప్పును అసలు పట్టుకోవద్దు. ఇలా చేయడం వల్ల అరిష్టం.

వంట చేస్తున్న ప్రతి సారి రెండు బియ్యపు గింజలను అగ్ని దేవుడికి సమర్పణ చేయాలి.

మంగళ సూత్రాలకు పిన్నీసులు, ఇతర గుచ్చుకునే వస్తువులను అసలు పెట్టవద్దు.