చేతిలోనే ప్రపంచాన్ని చూపించే ఫోన్ వల్ల ఉపయోగాలు ఎన్ని ఉన్నాయో నష్టాలు కూడా అన్నే ఉన్నాయి. అందుకే కొన్ని జాగ్రత్తలు పాటించాలి.

దిండ్లు, పరుపుల కింద ఫోన్ ను పెట్టి నిద్ర పోకూడదు. ఛార్జింగ్ కూడా పెట్టవద్దు.

తక్కువ రేటు అని నాసిరకం ఛార్జర్లను వాడకుండా.. కంపెనీ ఛార్జర్లను మాత్రమే వినియోగించాలి.

బ్యాటరీ ఉబ్బినా సరే నొక్కి నొక్కి ఫోన్ లో పెడుతూ వాడుతుంటారు కొందరు. కానీ ఇలా అసలు చేయవద్దు బ్యాటరీ పేలే ప్రమాదం ఎక్కువ ఉంటుంది.

ఛార్జింగ్ పెట్టి గేమ్స్ ఆడటం, వీడియోలు చూడటం అసలు చేయకూడదు.

ఫోన్ నీళ్లలో పడితే సర్వీస్ చేయించిన తర్వాతనే వినియోగించండి. బాగానే ఉంది కదా అని ఉపయోగించవద్దు.

ఛార్జింగ్ తక్కువ ఉన్నా స్విచ్ఛాఫ్ అయ్యే వరకు కూడా కొందరు ఫోన్ మాట్లాడుతుంటారు. ఇలా అసలు చేయవద్దు. అందుకే ఫోన్ కొంత శాతం వద్ద ఛార్జింగ్ పెట్టమని హెచ్చరిస్తుంటుంది.

రాత్రి సమయంలో ఛార్జింగ్ పెట్టి ఫోన్ ను వదిలేయకండి. ఛార్జ్ తీసిన తర్వాతనే పడుకోవాలి.