మానసిక ఆనందం  కష్టంగా మారింది.. ఫుల్ బిజీ, పక్కన అయిన వాళ్లు ఉండరు. ఉన్న వాళ్లు నాశనం కోరుకుంటారు.  అందుకే మనుషులు, మనస్తత్వాలు, ఆలోచనలు మారాలి అంటున్నారు నిపుణులు.  

కొన్ని ఆహారాలు తినడం వల్ల కూడా మానసిక ఆనందం దొరుకుతుందట. ఇంతకీ అవేంటి అనుకుంటున్నారా?

డార్క్ చాక్లెట్స్ : చాక్లెట్స్, డార్క్ చాక్లెట్స్  వీటిని తింటే ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు తగ్గించడంలో డార్క్ చాక్లెట్లు పనిచేస్తాయి. వీటిలోని ఫ్లేవనాయిడ్స్, కోకో జ్ఞాపకశక్తిని మెరుగు పరుస్తాయి. మంచి మూడును కూడా తెస్తాయి.

గుమ్మడి గింజలు, బ్లూబెర్రీ : గుమ్మడి గింజల్లో ఐరన్, మెగ్నీషియం, జింక్, కాపర్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి మెదడు ఆరోగ్యాన్ని రక్తిస్తాయి. మానసికంగా కూడా బలంగా మారుస్తాయి. 

కొవ్వు చేపలు, బ్రకోలీ : మాకరెల్, సాల్మోన్, సార్డైన్స్ వంటి కొవ్వు ఉండే చేపల్లో ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి. ఇవి మూడ్ ను మార్చి ఉల్లాసంగా మారుస్తాయి. 

పసుపు, నారింజ : పసుపులో కర్కుమిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది మెదడును చురుగ్గా మార్చుతుంది. మతిమరుపు వంటి సమస్యలను కూడా రాకుండా చూస్తుంది

ఆకుకూరలు, గింజలు : మానసికంగా బలంగా ఉండటం కోసం మీ డైట్ లో ఆకుకూరలు చేర్చడం చాలా అవసరం. వీటిలోని పొటాషియం, కాల్షియం, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి.