బెట్టా ఫిష్ రంగు రంగులలో ఉంటుంది. దీని రెక్కలు, పొడవు చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఈ చేపలో మరిన్ని ఇతర చేపలతో ఉండలేవు. వీటిని పెంచడం సులభమే.

గుప్పియోస్ చేపలు చాలా చిన్నవిగా ఉంటాయి. కానీ చాలా కలర్ ఫుల్ గా కనిపిస్తాయి. ఈ చేపలు బిగినర్స్ కి చాలా బెటర్. వీటి పెంపకం కూడా సులభం. ఎలాంటి నీటిలో కూడా జీవిస్తాయి. 

నియోన్ చేపలు చాలా చిన్నవిగా చూడటానికి ప్రశాంతంగా కనిపిస్తాయి. ఇవి ఎనిమిది అంతకంటే ఎక్కువ చేపలు ఉన్నా కూడా సులభంగా జీవిస్తాయి.

ఎన్నో రంగుల్లో అందుబాటులో ఉంటాయి ప్లేటీ చేపలు. ఇవి చిన్నగా కాకుండా పెద్దగా కాకుండా మీడియం సైజ్ లో ఉంటాయి. వీటి సంతతి త్వరగా పెరుగుతుంది. ఒక ఆక్వేరియంలో నాలుగు కూడా పెంచవచ్చు.

కారిడార్స్ క్యాట్ ఫిష్ లు చిన్నగా పీస్ ఫుల్ గా కనిపిస్తాయి. ఇవి ఆక్వేరియం అడుగు భాగంలో నే ఎక్కువగా ఉంటాయి. ఆక్వేరియంలో కింద ఉన్న ఫుడ్ ను తిని ట్యాంక్ ను నీట్ గా ఉంచడంలో హెల్ప్ చేస్తాయి.

చెర్రీ బర్బా చేపలు రెడ్ కలర్ లో ఉంటాయి. మొగ చేపలు మరింత ఎరుపుగా ఉంటాయి. ఇవి కూడా చూడటానికి చాలా పీస్ ఫుల్ గా అనిపిస్తాయి. 

మోలియోస్ చేపలు కూడా చాలా రంగుల్లో ఉంటాయి. చాలా ఆకారాల్లో అందుబాటులో ఉంటాయి. ఎలాంటి నీటిలో అయినా ఇవి జీవించగలవు.