తండ్రి కూతుళ్లు, తండ్రి కొడుకుల బంధం చాలా గొప్పది. ఇక వీరికి సంబంధించిన సినిమాలు కూడా చాలా వచ్చాయి. అయితే  అద్భుతమైన కొన్ని డబ్బింగ్ సినిమాల లిస్ట్ ను చూసేయండి.

ది లయన్ కింగ్ అనే సినిమాలో త్యాగం, గౌరవం విముక్తి వంటివి అద్బుతంగా చూపించారు. ఇందులో తండ్రి ముఫాసా నుంచి విలువైన జీవిత పాఠాలను నేర్చుకునే సింబా అనే యువ సింహం చుట్టూ సినిమా ఉంటుంది.

గాడ్జిల్లా మైనస్ వన్: మరణం లేని ఓ గాడ్జిల్లా  అందరినీ దాడి చేస్తుంటే హీరో కాపాడటానికి చాలా ప్రయత్నాలు చేస్తాడు. ఇందులో కూడా ఫాదర్ సెంటిమెంట్ కనిపిస్తుంది.  స‌ముద్రంలో ఓడ‌ల‌పై, న‌గ‌రాల‌పై దాడి చేస్తూ నానా భీబ‌త్సం సృష్టిస్తున్న గాడ్జిల్లాను ఎలా ఎదుర్కొన్నాడు అనేది సినిమా

మినారి: కుటుంబం కోసం ఒక తండ్రి సంకల్పంతో త్యాగం చేస్తూ కష్టపడుతుంటాడు. ఈ సినిమా కూడా ఎందరినో కదిలించింది.  అయితే తన కుటుంబానికి మెరుగైన జీవితం కావాలని కలలు కంటున్న ఏ తండ్రినైనా ఈ సినిమా ఏడిపిస్తుంది.

డెస్పికబుల్ మి: డెస్పికబుల్ మి ఒక అద్భుతమైన సినిమా. అనుకోకుండా ముగ్గురు అమ్మాయిలకు తండ్రి అయిన హీరో గురించి ఈ సినిమా ఉంటుంది. ఇందులో హాస్యం, సెంటిమెంట్ లు బాగుంటాయి. తండ్రి గురించి కూడా అద్భుతంగా చూపించారు.

ఇంటర్స్టెల్లార్: క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన దృశ్యపరంగా అద్భుతమైన సినిమా ఇంటర్‌స్టెల్లార్. సమయం, స్థలం గురించి సినిమా తెరకెక్కించినా తండ్రి కూతుళ్ళ బంధం గురించి చాలా గొప్పగా వివరించారు.

ట్రైన్ టు బుసాన్: మంచి థ్రిల్లర్‌ సినిమా కావాలనుకునే వారికి ఈ సినిమా బాగా నచ్చుతుంది. తండ్రి కూతురిని రక్షించుకోవడానికి చేసే తీరని ప్రయత్నాల చూస్తుంటే సీన్ సీన్ కు ఉత్కంఠభరితంగా ఉంటుంది. అంతేకాదు చాలా భావోద్వేగమైన సినిమా కూడా.

లోగన్: సూపర్ హీరో మూవీ లోగన్ లో మైండ్ బ్లాక్ చేసే యాక్షన్  ఎపిసోడ్స్ మనం చూడొచ్చు. అయితే లారా అనే అమ్మాయిని కాపాడటం కోసం లోగన్  ప్రయత్నం సినిమాలో భావోద్వేగానికి గురి చేస్తుంది.

Off-white Banner

Thanks For Reading...