https://oktelugu.com/

బిర్యానీ గురించి చెప్పగానే నోరు ఊరుతుంది కదా. బిర్యానీ హా మజాకా. మామూలుగా ఉండదు మరీ బిర్యానీతో..మీరు బిర్యానీ అనగానే చికెన్, మటన్ అనుకుంటున్నారా?

Image Credit : google

చికెన్, మటన్ మాత్రమే కాదు వెజ్ బిర్యానీ కూడా సూపర్ గా ఉంటుంది. మరి వెబ్ బిర్యానీ ప్రియులకు కొన్ని సూపర్ బిర్యానీల గురించి చెప్పాలి అనుకుంటున్నాం. ఓ లుక్ వేయండి

Image Credit : google

సతరంగి బిర్యానీ : దీన్ని క్లాసిక్ మట్టి కుండలో వండుతారు, ఈ బిర్యానీ గుమ్మడికాయ, క్యారెట్, బీన్స్ & సుగంధ ద్రవ్యాల మిశ్రమంతో సూపర్ టేస్ట్ ను అందిస్తుంది. ఈ రుచి మీ హృదయాన్ని గెలుస్తుంది అనడంలో సందేహం లేదు.

Image Credit : google

పనీర్ మఖానీ బిర్యానీ : ప్రొటీన్‌తో వండే ఈ బిర్యానీలో పనీర్ ముక్కలను క్రీమీ, రిచ్ గ్రేవీలో నానబెట్టి, అన్నంతో కలిపి వండుతారు. దీన్ని ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ మీకే తెలిసి పోతుంది.

Image Credit : google

వెజ్ దమ్ బిర్యానీ : మసాలాలు, ఎన్నో రకాల కూరగాయలు ఈ వెజ్ దమ్ బిర్యానీకి సూపర్ టేస్ట్ ను ఇస్తాయి. ఇది పార్టీలకు సరైన ఎంపిక అని చెప్పవచ్చు. కేవలం 25 నిమిషాల్లో మీ ముందు రెడీగా ఉంటుంది.

Image Credit : google

గుజరాతీ మట్కా బిర్యానీ : ఈ గుజరాతీ బిర్యానీ మరో అద్భుతం. హ్యాండీలో వడ్డిస్తారట, ఇది పనీర్, మసాలాలు & క్రీము గ్రేవీలతో ఒక ఆహ్లాదకరమైన వంటకంగా మీ ముందు తినడానికి రెడీగా ఉంటుంది ఆర్డర్ చేయగానే.. సో ఆర్డర్ వన్స్.

Image Credit : google

చీజ్ బిర్యానీ : ఈ బిర్యానీ సుగంధ ద్రవ్యాలు, కూరగాయలు & పనీర్‌తో కూడిన చీజ్ టేస్ట్ ను పెంచే బిర్యానీగా నిలుస్తుంది. ఇది వినూత్నమైన వంటకం అనడంలో సందేహం లేదు. ఒకసారి దీన్ని టేస్ట్ చేసినా సూపరో సూపర్ అంటారు.

Image Credit : google

జైతూనీ సబ్జ్ బిర్యానీ : ఈ బిర్యానీలో, సుగంధ ద్రవ్యాలు & మంచి పోషకమైన కూరగాయల కలిపి ప్రత్యేకమైన గుమగుమలాడే బిర్యానీని అందిస్తారు. మరి ఈ సారి హోటల్ కు వెళ్లినప్పుడు ఓ సారి ట్రై చేయండి.

Image Credit : google