ఛాతీ నొప్పి / అసౌకర్యం: గుండెపోటు ఎక్కువ మందిలో ఛాతీ మధ్యలో లేదా ఎడమ వైపు నొప్పి వస్తుంటుంది. కొన్ని నిమిషాల కంటే ఎక్కువసేపు ఉంటుంది.లేదంటే కాసేపు తక్కువై తర్వాత మళ్లీ రావచ్చు.
ఎగువ శరీర నొప్పి: నొప్పి భుజాలకు వచ్చి ఆ తర్వాత చేతులు, వీపు, మెడ, దవడ లేదా కడుపుకు వ్యాపిస్తుంది.
శ్వాస ఆడకపోవుట: ఛాతిలో అసౌకర్యంగా అనిపిస్తుంది. శ్వాస ఆడదు. అలాంటప్పుడు వెంటనే అలర్ట్ అవ్వాలి.
వికారం/వాంతులు: గుండెపోటు సమయంలో కొంతమందికి వికారం లేదా వాంతులు వస్తాయి.
తలతిరగడం: తలతిరగడం లేదా తలతిరుగుతున్నట్లు అనిపించడం గుండెపోటుకు సంకేతం కావచ్చు. ప్రత్యేకించి ఛాతీలో అసౌకర్యంగా ఉంటే జాగ్రత్త పడాలి.
అలసట: కారణం లేకుండా అలసట అనిపిస్తే గుండెపోటు లక్షణం కావచ్చు. ముఖ్యంగా మహిళల్లో ఎక్కువ కనిపిస్తుంది..
తక్షణ చర్య: గుండెపోటు ఉన్నట్టు అనుమానం అనిపిస్తే వెంటనే అత్యవసర సేవలకు కాల్ చేయండి. రక్తం గడ్డకట్టకుండా ఉండాలంటే ఆస్పిరిన్ (అలెర్జీ తప్ప) ను నమలండి. ముఖ్యంగా వెంటనే ఆస్పత్రికి వెళ్లండి.