పవన్ కళ్యాణ్ నా మజాకా? ఆ ఒక్క మూవీతో 12 రికార్డులు బద్దలు

‘జల్సా’ మూవీ. 2008 ఏప్రిల్ 2న రిలీజ్ అయిన ఈ మూవీ తొలిరోజే మంచి టాక్ తెచ్చుకుంది. హిట్ అందుకుంది. ఈ మూవీతో పవన్ పై విమర్శలకు చెక్ పడింది. ఫ్లాప్ లకు బ్రేక్ పడింది.

గీతా ఆర్ట్స్ బ్యానర్ పై మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా పాటలు అప్పట్లో సూపర్ హిట్. పవన్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు చేపట్టిన సినిమాగా ‘జల్సా’ నిలిచింది.

ఆడియో ద్వారానే కోటి రూపాయలు కలెక్ట్ చేసింది జల్సా మూవీ. నైజాంలో రూ.9.10 కోట్లు వసూళ్లు సాధించిన తొలి చిత్రంగా నిలిచింది.

‘గాల్లో తేలినట్టుందే’ అన్న పాటకు కోటి రూపాయలతో సెట్ వేయడం అప్పట్లో ఇదో రికార్డు. వరల్డ్ వైడ్ గా 1000 స్క్రీన్లలో రిలీజ్ అయిన తొలి మూవీ ‘జల్సా’.

ఇద్దరు స్టార్ హీరోలు దీనికి పాలుపంచుకున్నారు. 282 కేంద్రాల్లో ఈ జల్సా మూవీ 50 రోజులు ఆడింది. ప్రసాద్స్ ఐమాక్స్ లో ఈ మూవీ 85 లక్షలు కలెక్ట్ చేసిన మొట్టమొదటి చిత్రం ఇదే.