ఈ రోజుల్లో మధుమేహం విస్తరిస్తోంది. షుగర్ పేషెంట్లకు రాజధానిగా చైనా, ఇండియా నిలుస్తున్నాయి. ఎందుకంటే అన్నం తినే దేశాలు ఇవి రెండే.
షుగర్ వస్తే ఎలాంటి పండ్లు తీసుకోవాలనే దానిపై సందిగ్గత వ్యక్తం చేస్తుంటారు. మరి మధుమేహం ఉన్న వారు ఎలాంటి పండ్లు తీసుకోవాలో ఓ సారి చూద్దాం.
జామపండ్లు షుగర్ పేషెంట్లకు జామ పండు దివ్య ఔషధం. వీటిని ఎంత తీసుకున్నా నష్టం ఉండదు.
ఆపిల్ షుగర్ పేషెంట్లు ఆపిల్ పండ్లు తినడం మంచిది. అందుకే రోజుకో ఆపిల్ తింటే డాక్టర్ వద్దకు వెళ్లాల్సిన పనిలేదు.
నారింజ పండు కూడా మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుతాయి. విటమిన్ సి పుష్కలంగా ఉండటం వల్ల షుగర్ అదుపులో ఉంటుంది.
కివి పండ్లు కూడా షుగర్ ను కంట్రోల్ లో ఉంచుతాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు దాగి ఉన్నాయి. ఇంకా విటమిన్ సి ఉంటుంది. యాంటీ డయాబెటిస్ గా చెబుతారు.
పుచ్చకాయ కూడా మధుమేహులకు మంచిది. ఇందులో 90 శాతం నీరు ఉండటం వల్ల దీన్ని ఎక్కువగా తీసుకోవచ్చు.