https://oktelugu.com/

గర్భవతులు తినాల్సిన పండ్లు ఇవే..

Images source: google

గర్భవతులకు సరైన పోషకాహారం అవసరం. అయితే కొన్ని పండ్లు ప్రయోజనకరంగా ఉంటాయి. గర్భధారణ సమయంలో తల్లి, బిడ్డ ఇద్దరికీ అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లను అందిస్తాయి కొన్ని పండ్లు. అవేంటంటే?

Images source: google

అరటిపండ్లు: అరటిపండులో పొటాషియం పుష్కలంగా ఉంటుంది, కాళ్ళ తిమ్మిరిని నివారిస్తుంది. గర్భధారణ సమయంలో ఆరోగ్యకరమైన రక్తపోటు స్థాయిలను ప్రోత్సహిస్తుంది.

Images source: google

బెర్రీలు: స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీస్, రాస్ప్బెర్రీస్ వంటి బెర్రీలు యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి, ఫైబర్ తో నిండి ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. జీర్ణక్రియకు తోడ్పడతాయి.

Images source: google

నారింజలు: ఆరెంజ్ లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది.రోగనిరోధక పనితీరుకు కీలకమైనది. ఫోలేట్ కూడా ఇందులో ఉంటుంది. ఇది పిండం అభివృద్ధిలో సహాయపడుతుంది. పుట్టుకతో వచ్చే లోపాలను నివారిస్తుంది.

Images source: google

యాపిల్స్: యాపిల్స్ ఫైబర్ కు గొప్ప మూలం. జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది. గర్భధారణ సమయంలో సాధారణంగా వచ్చే మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది.

Images source: google

అవకాడోలు: అవకాడోలు ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫోలేట్, పొటాషియంతో నిండి ఉంటాయి. ఇవన్నీ పిండం మెదడు అభివృద్ధికి సహాయపడుతుంది. కాళ్ళ తిమ్మిరిని  తగ్గిస్తాయి.

Images source: google

మామిడికాయలు: మామిడి పండ్లలో విటమిన్ ఎ, సి పుష్కలంగా ఉంటాయి. శిశువు చర్మం, కళ్ళు, రోగనిరోధక వ్యవస్థ అభివృద్ధికి ముఖ్యమైనవి.

Images source: google