శరీరంలో జింక్ అవసరం చాలా ఉంటుంది. కానీ అన్నిఆహారాలలో ఇది లభించదు. మరి ఎందులో లభిస్తుందో తెలుసుకుంటే తినడం కూడా సులభమే కదా. అయితే ఓ లుక్ వేయండి.

చిక్కుడు జాతి గింజలు : ధాన్యాలు, బీన్స్, చిక్కుళ్ళలో జింక్‌ ఉంటుంది. వీటిని సూప్‌లు, వంటకాలు, సలాడ్‌లు మాదిరి తీసుకోవచ్చు

గింజలు, విత్తనాలు : గింజలు విత్తనాల్లో కూడా జింక్ పుష్కలంగా ఉంటుంది. అవిసె, గుమ్మడికాయ గింజల్లో మరింత ఎక్కువ ఉంటుంది జింక్. ఇందులో ఏకంగా 2.2 mg జింక్ ఉంటుంది.

తృణధాన్యాలు : తృణధాన్యాలు ఫైబర్,  పోషకాలను అందించడమే కాకుండా జింక్ ను కూడా ఇస్తాయి. కప్పుకు సుమారు 1.5 mg జింక్‌ ఉంటుంది. బ్రౌన్ రైస్, ఓట్స్ లో కూడా ఉంటుంది.

పాల ఉత్పత్తులు : శాఖాహారులకు, పెరుగు, చీజ్ వంటి పాల ఉత్పత్తులు జింక్ విలువైన మూలాలు. దీంట్లో కూడా దాదాపుగా 1-2 mg జింక్ ఉంటుంది. జున్నులో జింక్ కూడా ఉంటుంది.

గుడ్లు : ఒక గుడ్డు సాధారణంగా 1 mg జింక్‌ను కలిగి ఉంటుంది. అంతేకాదు ఇందులో ప్రోటీన్, విటమిన్లు కూడా ఉంటాయి.

డార్క్ చాక్లెట్ :  కోకో కంటెంట్ ఎక్కువగా ఉండే డార్క్ చాక్లెట్ లలో కూడా జింక్‌ పుష్కలంగా ఉంటుంది. ఒక డార్క్ చాక్లెట్ లో సుమారు 1 mg జింక్‌ ఉంటుంది.

కూరగాయలు : పుట్టగొడుగులు, బచ్చలికూర వంటి వాటిలో కూడా జింక్ ఉంటుంది. ఇందులో కాస్త తక్కువ జింక్ ఉంటుంది.