షోయబ్ అక్తర్ పాకిస్తాన్ దేశానికి చెందిన ఈ బౌలర్ గంటకు 161.3 కిలోమీటర్ల వేగంతో బంతులు విసిరేవాడు.. రావిల్పిండి ఎక్స్ ప్రెస్ గా పేరు గడించాడు.

షాన్ టైట్, ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు చెందిన షాన్ టైట్ స్పీడ్ బౌలర్ గా పేరుపొందాడు. గంటకు 161.1 కిలోమీటర్ల వేగంతో బంతులు విసిరేవాడు.

బ్రెట్ లీ ఈ ఆస్ట్రేలియా బౌలర్ వేగానికి పర్యాయపదంగా నిలిచాడు. గంటకు 161.1 కిలోమీటర్ల వేగంతో బంతులు విసిరేవాడు. 

జె థామ్సన్ ఆస్ట్రేలియా చెందిన ఈ వెటరన్ బౌలర్ 90వ దశకంలో మెరుపులు మెరిపించాడు. గంటకు 160.6 కిలోమీటర్ల వేగంతో బంతులను విసిరేవాడు.

మిచెల్ స్టార్క్ ప్రస్తుత ఆస్ట్రేలియా జట్టు తురుపు ముక్కగా ఉన్నాడు. గంటకు 160.4 కిలోమీటర్ల వేగంతో బంతులు విసురుతున్నాడు. 

అండి రాబర్ట్స్, వెస్టిండీస్ వెస్టిండీస్ జట్టుకు చెందిన ఈ బౌలర్ 90వ దశకంలో వేగవంతమైన బౌలర్ గా పేరుగాంచాడు. గంటకు 159.5 కిలోమీటర్ల వేగంతో బంతులు విసిరి రికార్డు సృష్టించాడు.

ఎడ్వర్డ్స్, వెస్టిండీస్ వెస్టిండీస్ జట్టు చెందిన ఈ వెటరన్ బౌలర్..స్పీడ్ స్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. గంటకు 157.7 కిలోమీటర్ల వేగంతో బంతులు వేసి రికార్డు సృష్టించాడు. 

మిచెల్ జాన్సన్ ఆస్ట్రేలియా కు చెందిన ఈ మాజీ బౌలర్ వేగానికి సిసలైన అర్ధాన్ని చెప్పాడు. గంటకు 156.8 కిలోమీటర్ల వేగంతో బంతులు విసిరి రికార్డు సృష్టించాడు.