ఆఫ్రికన్ ఏనుగులు సగటున 22 నెలలు గర్భవతిగా ఉంటాయి. ఆ తర్వాత పిల్లలకు జన్మనిస్తాయి.

Image Credit: Google

ఫ్రిల్డ్ షార్క్ అన్ని సకశేరుకాల కంటే ఎక్కువ గర్భధారణ కాలం కలిగి ఉంటాయి. ఏకంగా దీని గర్భధారణ కాలం 3.5 సంవత్సరాలు.

Image Credit: Google

ఖడ్గమృగం గర్భధారణ కాలం 15 నుంచి 18 నెలల వరకు ఉంటుంది. ఎక్కువ కాలం గర్భధారణ సమయం కలిగిన జంతువులలో ఒకటి.

Image Credit: Google

ఒంటెలు 12-15 నెలల పాటు సుదీర్ఘ గర్భ కాలాన్ని కలిగి ఉంటాయి

Image Credit: Google

జిరాఫీ గర్భం 14 నుంచి 15 నెలల మధ్య ఉంటుంది. అందుకే  దూడ పుట్టకముందే పూర్తిగా అభివృద్ధి చెంది ఉంటుంది.

Image Credit: Google

సముద్ర సింహం ఇతర సముద్ర క్షీరదాల కంటే ఎక్కువ గర్భధారణ కాలం కలిగి ఉంటాయి. ఇది 17 నెలల కంటే ఎక్కువ సమయమే తీసుకుంటాయట.

Image Credit: Google

డాల్ఫిన్ గర్భాలు 10 నుంచి 18 నెలల మధ్య ఉంటాయి. హార్బర్ పోర్పోయిస్‌కి 10 నెలల గర్భధారణ కాలం ఉంటుంది. అయితే ఓర్కాస్‌కి 18 నెలలు ఉంటుంది

Image Credit: Google

ఎలుగుబంట్లు సాధారణంగా 7 నుంచి 8 నెలల గర్భధారణ కాలాన్ని కలిగి ఉంటాయి, అయితే పరిస్థితులు అనుకూలించే వరకు అవి గర్భధారణను ఆలస్యం చేస్తాయి.

Image Credit: Google