ఎన్నో రకాల ఆహార పదార్థాలను మీరు తిని ఉంటారు. చూసి ఉంటారు. కానీ ప్రపంచంలో కెల్ల అత్యంత ఖరీదైన పదార్థాలు ఏంటో తెలుసా?
Images source: google
ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఆరు ఆహార పదార్థాల గురించి తెలుసుకుందాం.
Images source: google
కుంకుమపువ్వు: "బంగారు మసాలా" అని పిలిచే ఈ కుంకుమ పువ్వు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మసాలా. దీని ధరలు పౌండ్‌కు $500 నుంచి $5,000 వరకు ఉంటుంది.
Images source: google
వైట్ ట్రఫుల్స్: ప్రధానంగా ఉత్తర ఇటలీ అడవులలో కనిపిస్తాయి. వైట్ ట్రఫుల్స్ ధర పౌండ్‌కు $4,000 నుంచి $10,000 మధ్య ఉంటుంది.
Images source: google
బెలూగా కేవియర్: తరచుగా "బ్లాక్ గోల్డ్" అని పిలవబడే ఈ ఆహార వస్తువు ప్రపంచంలోని అత్యంత ఖరీదైన వంటకాల్లో ఒకటి, దీని ధరలు కిలోగ్రాముకు $10,000 వరకు ఉంటాయి.
Images source: google
బ్లూఫిన్ ట్యూనా: ఈ చేపలో కొవ్వు మాంసం చాలా ఉంటుంది. 2020లో, టోక్యోలోని సుకిజి చేపల మార్కెట్‌లో బ్లూఫిన్ ట్యూనా $1.8 మిలియన్లకు అమ్ముడు పోయింది.
Images source: google
జపనీస్ మాట్సుటేక్ పుట్టగొడుగులు: ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన శిలీంధ్రాల్లో ఒకటి. దీని ధర పౌండ్‌కు $1,000 నుంచి $2,000 మధ్య ఉంటుంది.
Images source: google
కోపి లువాక్: "సివెట్ కాఫీ" అని కూడా పిలుస్తారు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కాఫీ. దీని ధర పౌండ్‌కు $600 వరకు ఉంటుంది.
Images source: google