Images source: google
తెలంగాణలో సంస్కృతి, సంప్రదాయాలు, పండుగలు చాలా వరకు ప్రకృతితోనే ముడిపడి ఉంటాయి. తెలంగాణలో బొడ్డెమ్మ వేడుకలు ఆదివారం నుంచే ప్రారంభం అయ్యాయి.
Images source: google
భాద్రపద మాసంలో వచ్చే పౌర్ణమి నుంచి బొడ్డెమ్మ పున్నమిగా చేస్తుంటారు. ఈ నెలలో పౌర్ణమి తర్వాత వచ్చే పంచమి నుంచి చతుర్దశి వరకు బొడ్డెమ్మ పండుగ చేసుకుంటారు ప్రజలు.
Images source: google
ఈ పండుగ కూడా బతుకమ్మ మాదిరి తొమ్మిది రోజులు జరుగుతుంది. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి వరకు గల్లీలు, వాడలు మురిసిపోతుంటాయి.
Images source: google
యువతుల జీవన విధానం, ప్రకృతి, గౌరీదేవిపై పాటలు పాడుతూ.. డ్యాన్సులు చేస్తూనే పల్లె వాతావరణం ఆనందంగా ఉంటుంది. తొమ్మిదవ రోజు రాత్రి బొడ్డెమ్మను స్థానిక చెరువులు, కుంటల్లో నిమజ్జనం చేసి ఆ తర్వాత నుంచి బతుకమ్మ పండగ ప్రారంభం చేస్తారు.
Images source: google
ఎలా చేస్తారు: బొడ్డెమ్మను వేసేవారు చెరువు దగ్గరకు వెళ్తారు. అక్కడ నుంచి పుట్టమన్ను తెచ్చి నీటితో తడిపి ఒక చెక్క పీటపై నాలుగు మూలలతో ఐదు అంతస్తులు చేస్తారు.
Images source: google
దాని మీద చెంబు, ఆ పైన జాకెట్ ముక్క పెట్టి బియ్యం పోసి అలంకరిస్తారు. తొమ్మిది రోజులు సాయంత్రం ఎర్రమట్టి అలికి.. బియ్యం పిండి, కుంకుమ, పసుపుతో ముగ్గులు వేస్తారు.
Images source: google
బొడ్డమ్మ చుట్టూ చేరి.. పాటలు పాడుతూ డ్యాన్స్ చేస్తూ ఊరిని తొమ్మిది రోజులు పండగలా చేస్తుంటారు మహిళలు.
Images source: google