దయ్యాలు ఉన్నాయంటే నమ్ముతారా? కానీ చాలా దేశాల్లో ఇంకా వీటిని నమ్ముతున్నారు. దానికి సాక్షాలు కూడా ఉన్నాయి అంటారు. మరి నిజంగా దయ్యాలు ఉన్న ప్రాంతాల గురించి ఓ సారి తెలుసుకుందామా?

Image Credit : google

అర్జెంటీనాలోని సింకో సాల్టోస్ అనే నగరంలో చాలా దయ్యాలు ఉన్నాయట. వెళ్లాలి అని ఉందా చూడటానికి.. మరి ఓ సారి ట్రై చేసి రండి. ఇక్కడ మంత్రవిద్యలు కూడా ఎక్కువేనటోయ్..

Image Credit : google

ఇంగ్లాండ్‌లోని 12వ శతాబ్దపు సత్రం పురాతన రామ్ ఇన్ లో కూడా దయ్యాలు ఉండేవని చాలా స్టోరీలు ఉన్నాయి.

Image Credit : google

1867 నాటి అరరత్ వెర్రితల ఆశ్రయాన్ని సందర్శించాలి అంటే ధైర్యం ఉండాల్సిందే.  ఈ ప్రాంతం కూడా దయ్యాలతో కూడుకున్నదే అంటారు.

Image Credit : google

పెన్సిల్వేనియాలోని ఈస్టర్న్ స్టేట్ పెనిటెన్షియరీ కూడా ఎక్కువగా హారర్ ప్రాంతాల జాబితాలో ఉంది. అక్కడికి వెళ్లిన చాలా మంది దెయ్యాలను చూశామని.. ఏవో వాయిస్ లు వినిపిస్తూనే ఉంటాయని చెబుతుంటారు.

Image Credit : google

జపాన్‌లోని ఫుజి పర్వతంపై ఉన్న అకిగహారా ఫారెస్ట్ లో కూడా దయ్యాలు ఉన్నాయట. ఇది దట్టమైన అటవీప్రాంతం, ఇక్కడికి వెళ్లిన చాలా మంది ప్రాణాలు వదిలారు. ఇక్కడికి వెళ్తే పక్కా దయ్యాల వాయిస్ వింటారని చెబుతారు. మరి ట్రై చేస్తారా?

Image Credit : google

రాజస్థాన్‌లోని భంగర్ కోట కూడా భారతదేశం ఈ జాబితాలో చేరింది. ఇక్కడ చాలా మంది ఒక వధువు రూపంలో ఉన్న దయ్యాన్ని చూశామని చెబుతుంటారు. అందుకే సూర్యాస్తమయం తర్వాత ఇక్కడికి నో ఎంట్రీ.

Image Credit : google

శాన్ డియాగోలోని వేలీ హౌస్ లో కూడా ఇలాంటి స్టోరీ ఉంది. ఒకప్పుడు అక్కడ నివసించిన వేలీ కుటుంబం అనుభవించిన విషాదాలే దీనికి కారణం అంటారు. పక్కా ఇందులో దయ్యాలు ఉన్నాయని టాక్.

Image Credit : google