ప్రపంచంలో అత్యంత పురాతనమైన దేశాలు ఎన్నో ఉన్నాయి. శతాబ్దాలుగా ఇవి తమ ఉనికిని చాటుకుంటూ వచ్చాయి.

ప్రపంచంలో అత్యంత పురాతనమైన దేశాల్లో ఇరాన్, ఈజిప్టు, సిరియా, వియత్నం, ఆర్మేనియా, కొరియా, చైనా, భారతదేశం నిలుస్తున్నాయి.

ఇవన్నీ క్రీస్తు పూర్వం ఏర్పడడం విశేషం. ఇరాన్ అత్యంత పురాతన దేశం. క్రీస్తుపూర్వం 3200లో ఏర్పడినట్లు చరిత్ర చెబుతోంది.

ఇరాన్ ను 20వ శతాబ్దం మధ్యకాలం వరకు పర్షియా అని పిలిచేవారు. ఇరాన్ కు పురాతన ప్రధాన నాగరికతలలో  గొప్ప చరిత్ర ఉంది.

తరువాత పురాతన దేశాల్లో ఈజిప్టు ఉంది. క్రీస్తుపూర్వం 3100లో ఏర్పడినట్లు చరిత్ర చెబుతోంది. నార్మర్ మెనెస్ అనే రాజు ఈ దేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది

సిరియా అత్యంత పురాతన దేశం. క్రీస్తుపూర్వం 3000 నాటి దేశమిది. పురావస్తు తవ్వకాల్లో ఎల్బా అనే నగరం బయటపడింది.

వియత్నం కూడా పురాతన దేశమే. క్రీస్తుపూర్వం 2,879లో ఏర్పడినట్లు చరిత్ర చెబుతోంది.

అర్మేనియాది కూడా సుదీర్ఘ చరిత్ర. క్రీస్తుపూర్వం 2492లో ఏర్పడింది ఈ దేశం.

కొరియా క్రీస్తుపూర్వం 2333లో ఏర్పడినట్టు చరిత్ర చెబుతోంది. కాలానుగుణంగా కొరియా రాజధాని నగరాలు మారుతుంటాయి.

చైనా కూడా పురాతనమైన దేశాల్లో ఒకటి. క్రీస్తుపూర్వం 2070లో ఏర్పడింది.

ప్రపంచంలో అత్యంత పురాతన దేశాల్లో భారత్ ఎనిమిదో స్థానంలో నిలిచింది. క్రీస్తుపూర్వం 2000లో సింధులోయ నాగరికతతో భారతదేశం ప్రారంభమైంది.

భారతదేశ స్థాపనకు సింధులోయ నాగరికత లేదా రాజు చంద్రగుప్త మౌర్య కారణమని చెబుతుంటారు. మొదట పాటలీపుత్ర భారత రాజధానిగా కొనసాగింది.

రెండు లక్షల 50 వేల సంవత్సరాల నాటి గొప్ప చరిత్రను భారతదేశము  కలిగి ఉందని చరిత్రకారులు చెబుతుంటారు.

Off-white Banner

Thanks For Reading...