https://oktelugu.com/

సముద్రం కింద నుంచి వెళ్లే ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టు టన్నెల్ ప్రత్యేకతలివీ

భారతదేశపు మొట్టమొదటి నీటి అడుగున ఉన్న మెట్రోను ప్రధాని మోదీ ప్రారంభించారు. 

ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు కారిడార్ మొత్తం పొడవు 508 కి.మీ ఉంటుంది.

అందులో 348 కి.మీ గుజరాత్‌లో, 156 కి.మీ మహారాష్ట్రతో కలిగి ఉంది.

ఈ బుల్లెట్ రైలు గంటకు 320 కి.మీ వేగంతో వెళ్తుంది. ఈ హైస్పీడ్ రైలుకు 12 స్టేషన్లు ఉంటాయి.

ఈ 12 స్టేషన్లలో ఎనిమిది గుజరాత్‌లో, నాలుగు మహారాష్ట్రలో ఉంటాయి. 

ఈ రైలు పరిమిత స్టాప్‌లతో ముంబై, అహ్మదాబాద్ మధ్య ప్రయాణించడానికి సుమారు 2.07 గంటలు పడుతుంది.

మొత్తం స్టాప్‌లతో కలిపి దీని ప్రయాణం 2.58 గంటల వరకు పడుతుంది.

సబర్మతి, అహ్మదాబాద్, ఆనంద్, వడోదర, భరూచ్, సూరత్, బిలిమోరా, వాపి, బోయిసర్, విరార్, థానే మరియు ముంబై లు ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్ట్‌లోని 12 స్టేషన్లు.

థానే నుంచి ముంబై చేరుకోవడానికి బుల్లెట్ రైలు 7 కిలోమీటర్ల సముద్ర సొరంగం గుండా వెళుతుంది. ఇదే ఈ ప్రాజెక్ట్ లో హైలెట్ గా చెప్పొచ్చు.