https://oktelugu.com/

యుఎస్‌లోని మెరిసే మంచు గుహల నుంచి న్యూజిలాండ్‌లోని భూగర్భ బయోలుమినిసెంట్ ల్యాండ్‌స్కేప్‌ల వరకు, ప్రపంచంలోని అత్యంత ప్రత్యేకమైన కొన్ని గుహలు గురించి తెలుసుకుందాం.

Image Credit : google

న్యూజిలాండ్‌లోని వైటోమో గ్లోవార్మ్ గుహలు  గ్లోవార్మ్ జాతులకు ప్రసిద్ధి చెందాయి, ఇవి అతిపెద్దగా,  ప్రకాశవంతంగా ఉంటూ పబ్లిక్ ను అట్రాక్ట్ చేస్తుంటాయి.

Image Credit : google

ఇటలీలోని బ్లూ గ్రోట్టో గుహలు బ్లూ కలర్ లైటింగ్ తో విజిటర్స్ ను మంత్రముగ్దులను చేస్తుంది. ఇక్కడ స్విమ్మింగ్ కు అనుమతి లేదు. అయితే సందర్శకులు ఇప్పటికీ సముద్ర పర్యటనను బుక్ చేసుకుంటారట.

Image Credit : google

స్లోవేనియాలోని స్కోజాన్ గుహలు చాలా పెద్దగా ఉంటాయి. ఈ గుహలను 1986 నుంచి యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించారు.

Image Credit : google

ట్రావెల్ అండ్ లీజర్ మ్యాగజైన్ ప్రకారం USలోని మముత్ కేవ్ నేషనల్ పార్క్‌కు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్, ఇంటర్నేషనల్ బయోస్పియర్ రిజర్వ్ అనే బిరుదు ఇచ్చారు.

Image Credit : google

ఫిలిప్పీన్స్‌లోని ప్యూర్టో-ప్రిన్సెసా భూగర్భ నది UNESCO ప్రపంచ వారసత్వ ప్రదేశం. ఇది 30 మిలియన్ సంవత్సరాలకు పైగా చరిత్రను కలిగి ఉంది

Image Credit : google

జర్మనీలో ఉన్న సాల్‌ఫెల్డ్ ఫెయిరీ గ్రోటోస్, వాటి బహుళ వర్ణ ఖనిజ నిర్మాణాలకు ప్రసిద్ది చెందింది.

Image Credit : google

స్కాట్లాండ్‌లోని ఫింగల్స్ కేవ్ సహజంగా ఏర్పడిన షట్కోణ బసాల్ట్ స్తంభాలకు ప్రసిద్ధి చెందింది, ఈ ప్రకృతి దృశ్యాలు ఆకర్షించడమే కాదు.. వాటి నుంచి ఒకరకమైన సంగీతం వస్తుంటుందట.

Image Credit : google

అలస్కాలోని జునౌ సమీపంలో ఉన్న మెండెన్‌హాల్ మంచు గుహలు నీలం, తెలుపు రంగుల అద్భుతమైన ఛాయల్లో కనిపిస్తూ సూర్యకాంతి ద్వారా ప్రకాశిస్తాయి.

Image Credit : google

వియత్నాంలోని సోన్ డూంగ్ గుహ తొమ్మిది మైళ్లకు పైగా విస్తరించి ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద ఏకైక గుహగా పేరుగాంచింది.

Image Credit : google