కొందరికి శరీరంలో నీరు పెరిగిపోతుంది. దీనివల్ల అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. మరి శరీరంలో నీటి నిలుపుదల, ఉబ్బినట్లు కనిపించడం వల్ల అనారోగ్యంతో పాటు మనశ్శాంతి కూడా ఉండదు. ఈ సమస్యల నుంచి ఎలా దూరం అవ్వాలంటే..

Image Credit : google

సోడియం తక్కువ : అధిక సోడియం స్థాయిలు శరీరంలో నీటిని నిలుపుకునేలా చేస్తాయి. ప్రాసెస్ చేసిన ఆహారాలు, క్యాన్డ్ సూప్‌లు, ఉప్పగా ఉండే స్నాక్స్‌కు దూరంగా ఉండండి. ఉప్పుకు బదులుగా మీ భోజనంలో మూలికలు సుగంధాలను ఉపయోగించండి.

Image Credit : google

పొటాషియం అధికం : పొటాషియం శరీరంలోని సోడియం స్థాయిలను సమతుల్యం చేస్తుంది. ద్రవ రూపాలను నియంత్రణలో ఉంచుతుంది. అరటిపండ్లు, బొప్పాయిలు, దుంపలను మీ ఆహారంలో చేర్చుకోండి.

Image Credit : google

మెగ్నీషియం అధికం : మెగ్నీషియం ద్రవ సమతుల్యతను నియంత్రించడంలో సహాయపడుతుంది. గింజలు, తృణధాన్యాలు, ఆకు కూరల్లో మెగ్నీషియం ఎక్కువ ఉంటుంది. ఉబ్బరం తగ్గించుకోవడానికి మీ డైట్ లో వీటిని చేర్చుకోండి.

Image Credit : google

శారీరక శ్రమ : శారీరక శ్రమ రక్త ప్రసరణను ప్రోత్సహిస్తుంది. చెమట ద్వారా అదనపు నీటిని బయటకు పంపుతుంది. నీటి నిలుపుదలని అరికట్టడానికి వారంలో ఎక్కువ రోజులు నడవడం, సైక్లింగ్ లేదా స్విమ్మింగ్ లు కనీసం రోజులో 30 ని.లు అయినా చేయండి.

Image Credit : google

పాదాలు పైకి : మీ కాళ్లు లేదా పాదాలలో నీటి వల్ల వాపు వస్తే సుమారు 20 నిమిషాల పాటు వాటిని గుండె స్థాయి కంటే పైకి లేపి ఉంచండి.దీని వల్ల ప్రసరణ వ్యవస్థకు ద్రవం తిరిగి వస్తుంది. తద్వారా వాపు తగ్గుతుంది.

Image Credit : google

కంప్రెషన్ సాక్స్ : కంప్రెషన్ సాక్స్‌లు మీ కాళ్లపై కాస్త ఒత్తిడిని తెస్తాయి. మెరుగైన రక్త ప్రసరణను ప్రోత్సహిస్తాయి. ద్రవం పేరుకుపోవడాన్ని నివారిస్తాయి. గంటల తరబడి కూర్చొని, నిల్చొని పని చేసేవారికి ఇవి చాలా ఉపయోగపడతాయి.

Image Credit : google

శుద్ధి చేసిన పిండి పదార్థాలు : తెల్ల రొట్టె వంటి శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. నీరు వచ్చేలా చేస్తాయి. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్, రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉండటానికి తృణధాన్యాలను ఎంచుకోండి.

Image Credit : google