ఆల్‌బుఖరా పండ్లు తినడం వల్ల శరీరానికి ఎన్నో రకాల పోషకాలు లభిస్తాయి అంటున్నారు నిపుణులు. వీటిని తినడం వల్ల చాలా సమస్యలు దూరం అవుతాయట. మరి ఇంకా ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం.

ఆల్‌బుఖరా లేదా ప్లమ్ ఫ్రూట్స్ తినడం వల్ల ఐరన్ లోపం వల్ల రక్తహీనత నుంచి దూరం అవచ్చు.

ఇందులో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది, ఫైబర్‌లో 4% వీటి ద్వారా లభిస్తుంది అంటున్నారు నిపుణులు

పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో కీలకమైనది. ఈ పొటాషియం కూడా ఈ పండ్లలో లభిస్తుంది.

ఇందులో విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు ఇందులోని విటమిన్ ఎ కంటి చూపుకు చాలా సహాయం చేస్తుంది

ఇందులో ఉండే విటమిన్ కె రక్తం గడ్డకట్టడంలో సహాయపడటమే కాదు ఎముకలను దృఢం చేస్తుంది.

ఈ ఆల్‌బుఖరా పండ్లు రోగనిరోధక కణాలు ఆరోగ్యంగా ఉండటానికి సహాయం చేస్తాయి.