కొన్ని వ్యాయామాలు చేయడం వల్ల మీ హై బీపీ అదుపులో ఉంటుంది. అవేంటో తెలుసుకోండి.

ముఖ్యంగా ఐసో మెట్రిక్ వ్యాయామాలు చేయడం వల్ల త్వరగానే హైబీపీని కంట్రోల్ చేసుకోవచ్చట.

ఐసోమెట్రిక్ వ్యాయామాలు అంటే కదలకుండా చేసే వ్యాయామాలు. అంటే కండరాలను కదల్చకుండా చేయాలి.

గోడ కుర్చీ: గోడ కుర్చీ వేసినప్పుడు కాళ్లు, చేతులు, నడుము వంటివి కదల్చకుండా చేస్తారు.

యోగాలో కూడా కొన్ని ఆసనాలు ఐసోమెట్రిక్ వ్యాయామాల మాదిరి ఉంటాయి. వాటిని కూడా మీరు చేయవచ్చు

ఈ వ్యాయామాలు చేయడం వల్ల సిస్టాలిక్ రక్తపోటు 8.24MMHG మేరకు డయాస్టలిక్ రక్తపోటు 2.5MMHG  మేరకు తగ్గుతుందట

తెలియకుండానే కొన్ని సార్లు ఈ ఐసోమెట్రిక్ వ్యాయామాలను చేస్తుంటారు. టెన్నిస్ బాల్ ను చేతితో 30 సెకన్లు హోల్డ్ చేయడం వంటివి కూడా  ఐసోమెట్రిక్ వ్యాయామమేనట.

ఇలా చేయడం వల్ల వాటి చుట్టుపక్కల రక్తనాళాలు సంకోచించి రక్త ప్రసరణ మెరుగ్గా జరిగేలా చేస్తుందట.