దేవాలయాలు, పుణ్యక్షేత్రాలు శాంతి, ప్రశాంతతకు చిహ్నంగా ఉంటాయి.

వాస్తుశిల్పం, భక్తి వాతావరణం, ఆధ్యాత్మిక ఆచారాలు మనసును హాయిగా ఉంచుతాయి. ఇలాంటి కొన్ని ఆలయాల్లో పురుషులకు అనుమతి లేదు. మరి అవేంటంటే

అట్టుకల్ భగవతి ఆలయం, కేరళ:  ఈ ఆలయం అట్టుకల్ పొంగళ పండుగకు ప్రసిద్ధి చెందింది. ఈ కార్యక్రమంలో లక్షలాది మంది మహిళలు పాల్గొంటారు. ఇక్కడ పురుషులకు నో ఎంట్రీ.

చక్కలతుకవు ఆలయం, కేరళ:  ఇక్కడ దుర్గాదేవిని పూజిస్తారు. 'నారీ పూజ' అని పిలుచుకునే ఈ ఆలయంలోకి పురుషులకు అనుమతి లేదట.

కామాఖ్య ఆలయం, అస్సాం:  ఈ ఆలయంలో కామాఖ్య దేవి రుతుక్రమం, ఆమె దైవిక స్త్రీ శక్తిని జరుపుకుంటుంది అని నమ్ముతారట. ఇక్కడ అంబుబాచి మేళా సమయంలో పురుషులను అనుమతించరు.

కుమారి అమ్మన్ ఆలయం, తమిళనాడు: ఈ ఆలయంలో కన్యాకుమారి మాత ఉంటుంది. ముఖ్యంగా పెళ్లి అయిన మగవారు లోపలికి వెళ్లకూడదు.

బ్రహ్మ దేవాలయం, రాజస్థాన్:  ఈ ఆలయంలోకి పెళ్లి అయిన మగవారికి ఎంట్రీ ఉండదు.

సంతోషి మాత ఆలయం, జోధ్‌పూర్:  ఈ ఆలయంలో పురుషులను లోపలికి అనుమతించరు. ఈ తల్లిని కూడా చాలా నమ్ముతారు అక్కడి ప్రజలు.