2007 T20 వరల్డ్ కప్ లో గౌతమ్ గంభీర్ పాకిస్తాన్ జట్టుతో జరిగిన మ్యాచ్లో 54 బంతుల్లో 75 పరుగులు చేశాడు. ఈ రికార్డు చాలా రోజుల వరకు చెక్కు చెదరలేదు.

2009 టి20 అంటే రెచ్చిపోయే యువరాజ్ సింగ్.. వెస్టిండీస్ జట్టుతో జరిగిన మ్యాచ్లో 43 బంతుల్లో 67 పరుగులు చేశాడు. 

2010 టి20 క్రికెట్లో తొలి సెంచరీ సాధించిన ఘనత సురేష్ రైనా ది. సౌత్ ఆఫ్రికా తో జరిగిన మ్యాచ్లో 60 బంతుల్లో 101 పరుగులు చేశాడు

2012 టీమిండియా పరుల యంత్రంగా పేరు పొందిన విరాట్ కోహ్లీ 2012లో పాకిస్తాన్ జట్టుతో జరిగిన మ్యాచ్లో 61 బంతుల్లో 78 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.

2014 సీజన్లోనూ విరాట్ కోహ్లీ మెరిశాడు. శ్రీలంక జట్టుతో జరిగిన మ్యాచ్లో 58 బంతుల్లో 77 పరుగులు చేశాడు.

2021 వరల్డ్ కప్ లో రోహిత్ అదరగొట్టాడు. ఆఫ్ఘనిస్తాన్ జట్టుపై జరిగిన మ్యాచ్ లో 47 బంతుల్లో 74 పరుగులు చేశాడు

పొట్టి క్రికెట్ కప్ లో విరాట్ మరోసారి తన విశ్వరూపం చూపించాడు. పాకిస్తాన్ జట్టుతో జరిగిన మ్యాచ్లో 53 బంతుల్లో 82 పరుగులతో అజేయంగా నిలిచాడు.

2024: ప్రస్తుతం వెస్టిండీస్, అమెరికా వేదికగా జరుగుతున్న టి20 వరల్డ్ కప్ లో.. ఎవరు సంచలన ఇన్నింగ్స్ ఆడుతారో వేచి చూడాల్సి ఉంది..